వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

4 వేల మంది సైనికులకు కరోనా వ్యాక్సిన్.. లడాఖ్, లెహ్‌లో తొలి విడత షురూ...

|
Google Oneindia TeluguNews

కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. తొలుత ఫ్రంట్ లైన్ వారియర్స్, హెల్త్ వర్కర్లకు టీకా అందజేస్తున్నారు. దేశ రక్షణ కోసం ఆహో రాత్రులు శ్రమిస్తోన్న సైనికులకు టీకా ఇస్తున్నారు. లెహ్, లడాఖ్2లో 4 వేల మంది సోల్జర్స్‌కు టీకా అందజేస్తున్నారు. చైనాకు ఉత్తర భాగంలో మొహరించిన సైనికులకు కూడా వ్యాక్సిన్ అందజేస్తారు.

తొలుత లడాఖ్‌ సెక్టార్‌లో గల సైనికులకు వ్యాక్సిన్ ఇస్తారు. తర్వాత లెహ్, ఎల్ఏసీ వద్ద ఉన్న సైనికులకు టీకాలు వైద్యారోగ్య కార్యకర్తలు అందజేస్తారు. లడాఖ్, లెహ్ కలిపి మొత్తం 4 వేల మందికి వ్యాక్సిన్ ఇస్తారు. అయితే లడాఖ్‌లో తొలి విడత 4 వేల మందికి వ్యాక్సిన్ ఇవ్వడం చాలా తక్కువ సంఖ్య అని అర్థమవుతోంది. సముద్ర మట్టానికి ఎత్తున ఉన్న సైనికులకు కరోనా వైరస్ టెన్షన్ లేదని తెలుస్తోంది.

4,000 soldiers posted in Leh to get Covid vaccine starting Saturday

వైద్యారోగ్య కార్యకర్తలకు కూడా సరిపడ వ్యాక్సిన్ తొలి విడతలో ఇవ్వడం వీలుపడటం లేదు. రెండో విడతలో లడాఖ్‌కు ఎక్కువ టీకాలు పంపిస్తామని అధికారులు తెలిపారు. గత మే-జూన్ నుంచి చైనా- భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే కరోనా వైరస్ లడాఖ్‌లో ఎక్కువ ప్రభావం చూపలేదు. గత ఏడాది మార్చి 18వ తేదీన లెహ్‌లో తొలి కరోనా వైరస్ కేసు వచ్చింది. ఇరాన్ వెళ్లొచ్చిన తండ్రి వల్ల 34 ఏళ్ల జవాన్‌కు కరోనా సోకింది.

English summary
4,000 Army soldiers posted in Leh, Ladakh, will receive the Covid-19 vaccine Saturday as the inoculation drive kicks off across India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X