వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

14 స్వీపర్ ఉద్యోగాలకు వేలాదిమంది ఎంబీఏ, ఇంజినీరింగ్, ఎంటెక్ విద్యార్థులు దరఖాస్తు

|
Google Oneindia TeluguNews

చెన్నై: ఉన్నత చదువులు చదివిన వారు కిందిస్థాయి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు వెనుకాడుతారని చాలామంది భావిస్తారు. కానీ నిరుద్యోగం కారణంగా ఎంబీఎం, ఎంటెక్, బీటెక్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు కూడా కిందిస్థాయి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటున్నారు.

14 ఖాళీలు.. నాలుగువేల మంది దరఖాస్తు

14 ఖాళీలు.. నాలుగువేల మంది దరఖాస్తు

తమిళనాడులోని అసెంబ్లీ సచివాలయంలో స్వీపర్ ఉద్యోగాలకు ఉన్నత ఉద్యోగాలు చదివిన వారు దరఖాస్తు చేసుకున్నారు. ఇక్కడ మొత్తం 14 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో స్వీపర్ ఉద్యోగానికి పది ఖాళీలు, శానిటరీ వర్కర్ ఉద్యోగానికి నాలుగు ఖాళీలు ఉన్నాయి. వీటి కోసం డిప్లోమా పూర్తి చేసిన వారు కూడా రేసులో నిలిచారు.

కొందరికి ఎలిజిబులిటీ లేదని తొలగింపు

కొందరికి ఎలిజిబులిటీ లేదని తొలగింపు

అసెంబ్లీ సెక్రటరియేట్ గత ఏడాది సెప్టెంబర్26వ తేదీన ఖాళీలు ఉన్న ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పింది. ఈ ఉద్యోగానికి క్వాలిఫికేషన్ పెద్దగా క్వాలిఫికేషన్ ఏమీ లేదు. కనీస వయస్సు మాత్రం 18. ఇందుకోసం వేలాది దరఖాస్తులు వచ్చాయి. మొత్తంగా 4,607 మంది ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసిన వారిలో 677 అప్లికేషన్లు ఎలిజిబులిటీ లేని కారణంగా తొలగించారు.

 ఇంజినీరింగ్, ఎంబీయే, ఎంటెక్ ఉద్యోగులు సహా దరఖాస్తు

ఇంజినీరింగ్, ఎంబీయే, ఎంటెక్ ఉద్యోగులు సహా దరఖాస్తు

మొత్తంగా 3,930 అభ్యర్థులకు ఇంటర్వ్యూ కోసం లెటర్స్ పంపించారు. వేతనం రూ.15,700 నుంచి రూ.50,000 వరకు ఉంది. రిక్రూట్మెంట్ రోస్టర్ ప్రకారం 4 ఉద్యోగాలు జనరల్ కేటగిరీకి, 4 ఓబీసీలకు, 3 బీసీలకు డీ నోటిఫైడ్ ట్రైబ్స్‌కు, 2 ఎస్సీలకు, 1 ఎస్టీలకు కేటాయించారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారిలో చాలామంది ఎంబీఏ, ఇంజినీరింగ్, ఎంటెక్, బీటెక్ చేసిన విద్యార్థులు ఉన్నారు.

English summary
Amid a slugfest over job generation between the Narendra Modi government and the opposition, around 4,000 people have registered for 14 posts of sanitary workers at the state assembly secretariat in Chennai. What is surprising and shocking is that a sizeable number of them are Engineering graduates and MBAs besides degree holders in the Commerce, Arts and Science streams.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X