వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గురుగ్రామ్‌లో 4.7 తీవ్రతతో భూకంపం, ఢిల్లీలోనూ ప్రకంపనాలు, జనం పరుగులు

|
Google Oneindia TeluguNews

దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి భూమి కంపించింది. ఇటీవల వరసగా ఢిల్లీ, సమీప ప్రాంతాల్లో భూకంపం వస్తున్న సంగతి తెలిసిందే. అయితే శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీ మరోసారి భూకంపం వచ్చింది. గురుగ్రామ్‌లో 4.7 తీవ్రతతో భూమి కంపం రావడంతో పక్కన గల దేశ రాజధాని ఢిల్లీ వరకు ప్రకంపనాలు వచ్చాయి. అయితే గురుగ్రామ్‌కు నైరుతి దిశలో 63 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉంది అని అధికారులు గుర్తించారు. అదీ రాజస్థాన్‌లోని అల్వార్ అని పేర్కొన్నారు. భూకంపం 35 కిలోమీటర్ల లోతు వరకు ప్రభావం చూపించిందని తెలిపారు. 3-4 సెకన్లపాటు భూమి కంపించిందని భూగర్భ శాస్త్రవేత్తలు తెలిపారు. భూప్రకంపనాలతో జనాలు ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు.

4.7 magnitude earthquake strikes near Gurugram, strong tremors felt in Delhi-NCR

ఇటీవల ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భూకంపం వస్తోంది. ఢిల్లీ పరిసరాల్లో గల నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్‌లో 18 సార్లు భూమి కంపించింది. ఇందులో 8 సార్లు రోహ్‌తక్‌లో రావడం విశేషం. అయితే ఇవన్నీ కూడా మధ్యస్థ భూకంపాలు కావడంతో.. ప్రాణ నష్టమేమీ సంభవించలేదు. ఇటీవల జమ్ముకశ్మీర్‌లోనూ భూమి కంపించింది.

English summary
Delhi and adjoining cities in the Delhi NCR felt strong earthquake tremors today. The tremors lasted for nearly 3-4 seconds.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X