9 మంది మృతి.. ఒకే ఫ్యామిలీ.. ఎక్కడ, ఎలా జరిగిందంటే..
ఇటీవల వర్షాలు భారీగానే కురుస్తున్నాయి. దీని వల్ల పంటలకు నష్టం.. ఏపీ.. తెలంగాణలో కూడా వర్ష బీభత్సం కొనసాగుతోంది. ఇక తమిళనాడు, కేరళ గురించి అయితే చెప్పక్కర్లేదు. వాయుగుండాలు ఏర్పడటం.. అల్పపీడనం వల్ల ఓ విధంగా కుంభవృష్టి పడుతోంది. వర్షాల వల్ల పలు భవంతులు కూడా కప్పకూలిపోతున్నాయి. తమిళనాడులో గల వేలూరు జిల్లా పెన్నంబుల్ లో ఓ భవనం కుప్పకూలింది.
భవనం కూలడంతో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిదిమంది మృతి చెందారు. మరో తొమ్మిదిమంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నారు. ప్రాథమిక విచారణలో మృతుల పేర్లు మిస్బా ఫాతిమా, అనీసా బేగం, రూహి నాజ్, కౌసర్, తంజీలా, అఫీరా, మన్నులా, తామెడ్ మరియు అఫ్రాగా తేలింది. గాయపడిన వ్యక్తులు గుడియాతం ప్రభుత్వ ఆసుపత్రి, అడుక్కంపరైలోని ప్రభుత్వ వెల్లూరు మెడికల్ కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

పెర్నాంబుట్ టౌన్లో ఉన్న ఓ భవనం ఉదయం 6.30 గంటలకు కుప్పకూలిపోయిందని రెవెన్యూ డివిజనల్ అధికారి ధనంజేయన్ తెలిపారు. వరదనీరు వల్ల ప్రమాదం జరిగిందని తెలిపారు.తమిళనాడు ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్ సిబ్బంది సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. కూలిన భవన శిథిలాల నుంచి తొమ్మిది మందిని సురక్షితంగా కాపాడారు. వారికి గాయాలు కావటంతో ఆస్పత్రికి తరలించారు.
జిల్లా కలెక్టర్ పి. కుమారవేల్ పాండియన్ పరిస్థితిని పరిశీలించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఘటనపై సీఎం స్టాలిన్ దిగ్ర్భాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు పట్ల సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ఐదు లక్షలు. గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ.50వేలు అందజేస్తామని ప్రకటించారు.
పంట చేతికి వచ్చే సమయంలో కురుస్తోన్న వర్షాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే వరి పంట చేతికి వచ్చింది. వర్షాలు పడటంతో.. నీటితో తడిగా ఉంటుంది. దీంతో మిషన్ల ద్వారా కోత మరింత కష్టం అవుతుంది. వరుణ దేవ తమను కరుణించు అని అన్నదాతలు వేడుకుంటున్నారు. కానీ తుపానులు, అల్పపీడనలు ఏర్పడుతున్నాయి. దీంతో రైతన్న బిక్కు బిక్కుమంటున్నాడు. మళ్లీ అల్పపీడనం ఏర్పడటంతో రైతన్న ఆందోళన చెందతున్నాడు. పంట కోయడం, విక్రయించడం ఇబ్బందిగా మారుతుందని అంటున్నారు. తమ పట్ల ప్రభుత్వాలే కాదు.. వాతావరణం కూడా పగబట్టిందని వివరించారు. కానీ చాలా చోట్ల వరి కోత అయిపోయింది. కొన్ని చోట్ల మాత్రమే మిగిలి ఉంది.