వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాల్పులకు తెగబడ్డ మావోయిస్టులు: నలుగురు పోలీసులు మృతి

|
Google Oneindia TeluguNews

రాంచీ: జార్ఖండ్ రాష్ట్రంలోని లతేహర్ జిల్లాలో దారుణానికి తెగబడ్డారు. నక్సల్స్ జరిపిన దాడిలో నలుగురు పోలీసులు మృతి చెందారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.

శబరిమల భక్తులు అర్బన్ నక్సల్స్ : కేంద్రమంత్రి మురళీధరన్ వివాదాస్పద వ్యాఖ్యలుశబరిమల భక్తులు అర్బన్ నక్సల్స్ : కేంద్రమంత్రి మురళీధరన్ వివాదాస్పద వ్యాఖ్యలు

శుక్రవారం రాత్రి చంద్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని లుకియతాండ్ గ్రామం సమీపంలో పెట్రోల్ వ్యాన్‌పై సాయుధులైన మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో నలుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో అసిస్టెంట్ సబ్‌ఇన్ స్పెక్టర్ కూడా ఉన్నారు.

 4 cops killed in Naxal attack in Latehar

మృతుల్లో ఏఎస్ఐ సుక్రా ఓరయన్, హోంగార్డ్ జవాన్లు సికందర్ సింగ్, జమున ప్రసాద్, శంభు ప్రసాద్ ఉన్నారని ఓ పోలీసు అధికారి తెలిపారు. ఈ ఘటనపై జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘువర్ దాస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మావోయిస్టుల దాడిని తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.

ఈ దాడి ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ ప్రాంతంలో కూంబింగ్ చేపడుతున్నారు. జార్ఖండ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మావోయిస్టులు ఇలా దాడులకు పాల్పడటంతో ఆ ప్రాంత ప్రజల్లో ఆందోళన నెలకొంది.

English summary
Four police personnel have been killed in a Naxal attack near a village in Latehar district of Jharkhand, police said on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X