వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యమునా నదిలో బుట్టలో 4 రోజులు శిశువు, ఎండ దెబ్బకు కమిలిన చర్మం

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

లక్నో: యమునా నదిలో వెదురు బుట్టలో తేలుతూ వస్తోన్న నాలుగు రోజుల వయసున్న బిడ్డను స్ధానికులు రక్షించారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న శిల్వానీ గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

రాంజీలీలా అనే ఓ పశువుల కాపరి శనివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో వెదురుబుట్ట ఒకటి నదిలో తేలుతూ వెళ్లడం చూసి ఆశ్చర్యపోయాడు. నదిలో ఎవరో పిల్లలు ఆడుకుంటూ వదిలేసి ఉంటారని అనుకున్న అతడు, కుతూహలంతో పడవ సహాయంతో దగ్గరకు వెళ్లి చూసే సరికే నాలుగు రోజులున్న ఓ పసిబిడ్డ అందులో ఉన్నాడని తెలిపారు.

4-day-old baby floating in a basket in Yamuna miraculously found alive, rescued

శిశివు బతికే ఉన్నాడని గుర్తించిన అతను బిడ్డను రక్షించి ఒడ్డుకు తీసుకువచ్చాడు. ఎండ దెబ్బకు బాగా కమిలిపోయిన చిన్నారిని సమీపంలోని గ్రామానికి తీసుకువెళ్లి, పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు ఆ బేబిని హుటాహుటిన స్ధానిక ఆసుపత్రిలో చేర్పించారు.

ఈ విషయంపై ఫతేబాద్ ఎఎస్పీ సోమన్ బర్మన్ మాట్లాడుతూ తొలుత మేం బేబిని చూసినప్పుడు పరిస్ధితి విషమంగా ఉందన్నాడు. వెంటనే ఆంబులెన్స్‌లో ఎన్ఎన్ మెడికల్ కాలేజీకి తరలించామన్నారు. అక్కడ వైద్యులు బేబిని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉంచి చికిత్సను అందిస్తున్నారని పేర్కొన్నారు.

నీళ్లలో తేలియాడుతున్నప్పుడు ఎండ తగలడం వల్ల బిడ్డకు చర్మం కమిలిపోయిందని వైద్యులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

English summary
A four-day-old baby boy found floating in a basket at Yamuna river was rescued by a local shepherd, who was herding his cattle to the river bank at the time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X