• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

4 రోజులే వర్కింగ్ డేస్..! ప్రపంచస్థాయిలో కొత్తప్రతిపాదన, సాధ్యమవుతుందా?

|

ఢిల్లీ : వారానికి ఏడు రోజులు. అందులో 6 పనిదినాలు, ఒకరోజు వీక్ ఆఫ్. కొన్ని సంస్థల్లో 5 రోజులే వర్కింగ్ డేస్. అయితే ఆఫీసుల్లో పని వత్తిడి వల్ల చాలామంది ఉద్యోగులు వీక్ ఆఫ్ కోసం ఎంతలా ఎదురుచూస్తారో చెప్పనక్కర్లేదు. ఇక సాఫ్ట్‌వేర్ సంస్థల ఉద్యోగులకు వారానికి 5 రోజులే పనిదినాలైనా.. వీకెండ్ కోసం పరితపిస్తుంటారు. సోమవారం నుంచి శుక్రవారం దాకా వీపరీతమైన వత్తిడి కారణంగా.. ఆ రెండు రోజులు రిలాక్స్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటారు.

అదలావుంటే వర్కిండ్ డేస్ 5 రోజులేంది, 6 రోజులేంది?.. వారానికి 4 రోజులే ఉంటే ఉద్యోగులకు ఉపశమనం దొరికి పనితీరు మెరుగుపడుతుందనేది ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్న వాదన. ఆ మేరకు పెద్దఎత్తున మద్దతు లభిస్తుండటం విశేషం.

 4 రోజులే పని..! ప్రపంచ స్థాయిలో చర్చ

4 రోజులే పని..! ప్రపంచ స్థాయిలో చర్చ

వారానికి ఆరు రోజులు పని, ఒక్క రోజు సెలవు. కొన్ని రంగాలు మినహాయించి.. దాదాపు ఏ సంస్థలో చూసినా, ఏ ప్రాంతంలో చూసినా ఇలాగే ఉంటుంది. అయితే ఉద్యోగుల పనితీరు మెరుగుపడాలంటే 6రోజుల, 5రోజుల పనిదినాలు సరికాదనే కొత్త వాదన తెరపైకి వచ్చింది. పని వత్తిడి మూలంగా ప్రొడక్టివిటీ తగ్గిపోతుందనే కారణాలు వినిపిస్తున్నాయి. దాంతో 4 రోజులు వర్కింగ్ డేస్ ఐతే ఉద్యోగులు మరింత ఉత్సాహంగా పనిచేస్తారనేది నిపుణుల మాట. ఈ నేపథ్యంలో దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో జరిగిన చర్చ ప్రాధాన్యత సంతరించుకుంది. 4 రోజుల పనిదినాలకు ఆర్థికవేత్తలు, సైకాలజిస్టులు సైతం మద్దతు పలకడం శుభపరిణామంగా భావించొచ్చు.

 సైకాలజిస్ట్ చర్చ.. జై కొట్టిన నిపుణులు

సైకాలజిస్ట్ చర్చ.. జై కొట్టిన నిపుణులు

ఉద్యోగులు మెరుగైన పనితీరు కనబరచాలంటే.. 4 రోజుల పని విధానం మంచి ఫలితాలు ఇస్తుందంటారు ప్రముఖ సైకాలజిస్ట్ ఆడమ్ గ్రాంట్. అంతేకాదు సంస్థలకు వారు విధేయులుగా ఉండటానికి తోడ్పడుతుందని తెలిపారు. దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా 4 రోజుల పనిదినాల సాధ్యాసాధ్యాలపై చర్చ జరిగింది. ఆ సమావేశంలో తన వాదన వినిపించారు ఆడమ్ గ్రాంట్. ఈ అంశంపై స్పందించిన చరిత్రకారుడు, ప్రముఖ ఆర్థిక వేత్త బ్రెగ్‌మెన్‌ కూడా ఆడమ్ గ్రాంట్ వాదనను సమర్థించారు. ఉద్యోగులకు ఒకటి, రెండు రోజులకు బదులు 3 రోజుల సెలవులిస్తే మంచి ఫలితాలు వస్తాయని అభిప్రాయపడ్డారు. ఆయా సంస్థల పాలసీ మేకర్స్ ఈ అంశాన్ని పరిశీలించాలని సూచించారు.

 ఉద్యోగులకు సంతృప్తి.. మెరుగైన పనితీరు

ఉద్యోగులకు సంతృప్తి.. మెరుగైన పనితీరు

సదస్సుకు వచ్చిన ఇతర రంగాలకు చెందిన నిపుణులు కూడా 4 రోజుల పని విధానానికి మద్దతు పలికినట్లు తెలుస్తోంది. పని వత్తిడి తక్కువగా వుంటే ఉద్యోగులు సంతృప్తిగా పనిచేస్తారని, తద్వారా 20 శాతం ప్రొడక్టివిటీ పెరిగే ఛాన్సుందనే విషయం చర్చకు వచ్చింది. సర్వేలు, అధ్యయనాలు కూడా అదే విషయం చెబుతున్నాయనేది నిపుణుల మాట. ఇప్పుడున్న 5, 6 రోజుల పని కారణంగా కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్న ఉద్యోగులు.. వృత్తి నిర్వహణలో అసంతృప్తిగా ఉన్నారనే అంశం తెరపైకి వచ్చింది. మొత్తానికి 4 రోజుల పని విధానంపై ప్రపంచ స్థాయిలో చర్చ జరగడం ఆహ్వానించదగ్గ పరిణామం. అయితే ఆయా సంస్థలు దీనిపై ఎలా స్పందిస్తాయనేది చూడాలి.

English summary
prominent psychologist Adam Grant says that, Employees have to do better performance, the 4 day working process gives good results. He also said that they can help the organization be loyal. The 4-day workday discussions were held as part of the World Economic Summit in Davos.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more