వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కృష్ణాష్టమి పండుగ వేళ విషాదం: గోడకూలి నలుగురి దుర్మరణం: ఆలయంలో తొక్కిసలాట!

|
Google Oneindia TeluguNews

కోల్ కత: కృష్ణాష్టమి పండుగ వేళ విషాదం చోటు చేసుకుంది. ఓ ఆలయానికి సంబంధించిన ప్రహరీ గోడ కూలిన ఘటనలో నలుగురు భక్తులు దుర్మరణం పాలయ్యారు. 27 మందికి పైగా గాయపడ్డారు. గోడ కూలిన వెంటనే భక్తులు పరుగులు పెట్టాల్సి రావడంతో.. ఆలయంలో తొక్కిసలాట సంభవించింది. ఈ ఘటనలో మరికొంతమంది గాయపడ్డారు. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. వారిని అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో పశ్చిమ బెంగాల్ 24 ఉత్తర పరగణ జిల్లాలోని కఛువాలో చోటు చేసుకుంది.

కృష్ణాష్టమి పండుగ కోసం కఛువాలోని ఉన్న లోకనాథేశ్వర స్వామి వారి ఆలయంలో పెద్ద ఎత్తున వేడుకలను ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో పాల్గొనడానికి స్థానికులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్నారు. కొంతకాలంగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావానికి ఆలయ ప్రహరీ గోడ పూర్తిగా నానిపోయి కనిపించింది.

 4 killed, 27 injured as wall of temple collapses on people gathered to celebrate Janmashtami

అదే సమయంలో భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకోవడం, పలువురు దాని పైకి ఎక్కి కూర్చోవడంతో ఒక్కసారిగా అది కుప్పకూలిపోయింది. ఈ ఘటనలు నలుగురు భక్తులు సంఘటనాస్థలంలోనే దుర్మరణం పాలయ్యారు. కుప్పకూలిన గోడ రాళ్ల మధ్య వారి మృతదేహాలు చిక్కుకునిపోయి కనిపించాయి. గోడ కూలడంతో పలువురు గాయపడ్డారు.

 4 killed, 27 injured as wall of temple collapses on people gathered to celebrate Janmashtami

ఈ విషయాన్ని తెలుసుకున్న వెంటనే ఆలయంలో ఉన్న భక్తులు బయటికి పరుగు పెట్టడానికి ప్రయత్నించడంతో.. స్వల్పంగా తొక్కిసలాట చోటు చేసకుంది. ఈ ఘటనలో కూడా మరికొంతమంది గాయపడ్డారు. వారిని సమీప ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు కఛువా డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబీకులకు తన సంతాపాన్ని తెలియజేశారు. మృతుల కుటుంబాలకు లక్ష రూపాయలు, గాయపడ్డ వారికి 50 వేల రూపాయల పరిహారాన్ని ప్రకటించారు.

English summary
At least four people were killed and dozens injured after a wall at a temple collapsed on people who had gathered to celebrate Janmashtami festival in 24 North Parganas district on Friday. The injured are being treated at the National Medical College and Hospital. As per reports, the wall collapse at the temple in Kachua area of the district also triggered a stampede-like situation as people ran to their safety. The Loknath temple where the incident took place is popular among locals and every year lakhs gather here to celebrate the festival.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X