వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఛత్తీస్ గడ్ సుకుమా జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ .. నులుగురు మావోయిస్టులు మృతి

|
Google Oneindia TeluguNews

ఛత్తీస్ గడ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దున గల చింతల్ నార్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కు మధ్య జరిగిన ఎన్ కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది.

ఈరోజు ఉదయం 6 గంటల నుండి ప్రారంభమైన ఎన్ కౌంటర్ ఇంకా కొనసాగుతోంది. భీమ పూర్ నుండి ఒక కిలోమీటర్ లోపల అటవీ ప్రాంతంలో, జాగరగుండా ఏరియాలో కోబ్రా యూనిట్ గాలింపు చేస్తుండగా ఈ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్లో నలుగురు యూనిఫామ్ లు ధరించిన మావోయిస్టులు మృతి చెందగా వారి వద్ద నుండి ఒక ఇన్సాస్ రైఫిల్, రెండు 303 రైఫిల్ లను స్వాధీనం చేసుకున్నారు సీఆర్పీఎఫ్ పోలీసులు. మృతి చెందిన మావోయిస్టు ఎవరనేది గుర్తించాల్సి ఉంది.

4 Maoists Killed In Encounter With CRPF Commandos In Chhattisgarhs Sukma

మావోయిస్టులను గెరిల్లా వ్యూహాలతో సమర్థవంతంగా దాడులు చేయగల సీఆర్పీఎఫ్ పోలీసులు ప్రస్తుతం ఈ అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతోంది. ప్రత్యేక దళాలతో కూంబింగ్ కొనసాగుతోంది.
సరిహద్దు గ్రామాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది.

English summary
Four maoists were killed in an encounter today in Chhattisgarh's Sukma district. A gun battle broke out between maoists and a special unit of the Central Reserve Police Force or CRPF early this morning. The gunfight began around 6 am when a Commando Battalion for Resolute Action or CoBRA unit, was on a search mission in deep forested area around one kilometre from Bimapur in Jagargunda area."Four bodies of maoists in uniform, one Insas rifle and two 303 rifle were recovered," said a CRPF official.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X