వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మావోయిస్టుల ఘాతుకం: వాహనాన్ని పేల్చడంతో నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి

|
Google Oneindia TeluguNews

బీజాపూర్: ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. మరి కొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నిక‌ల జ‌ర‌గ‌నున్న తరుణంలో భ‌ద్ర‌తా ద‌ళాలే లక్ష్యంగా విధ్వంసం సృష్టించారు. బీజాపూర్ జిల్లాలో సీఆర్‌పీఎఫ్ జ‌వాన్లు వెళ్తున్న వాహ‌నాన్ని మావోయిస్టులు పేల్చేశారు.

 4 Paramilitary Men Killed In Maoist Attack Ahead Of Chhattisgarh Polls

ఈ ఘ‌ట‌న‌లో న‌లుగురు సీఆర్‌పీఎఫ్ జ‌వాన్లు మృతి చెందారు. మ‌రో ఇద్ద‌రికి గాయాల‌య్యాయి. ఘ‌ట‌న జ‌రిగిన అనంత‌రం మ‌రిన్ని బ‌ల‌గాలు అక్క‌డికి చేరుకొని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టాయి. మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వ‌హిస్తున్నాయి.

కాగా, న‌వంబ‌రులో ఛ‌త్తీస్‌గ‌ఢ్ అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. రెండు విడ‌త‌ల్లో పోలింగ్ నిర్వ‌హిస్తారు. న‌క్స‌ల్ ప్ర‌భావిత ప్రాంతాల్లో న‌వంబ‌రు 12న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. మిగిలిన ప్రాంతాల్లో నవంబ‌రు 20న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. తెలంగాణ‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్‌, రాజ‌స్థాన్‌తో పాటు డిసెంబ‌రు 11న ఫ‌లితాలు వెలువడనున్నాయి.

English summary
Four soldiers of the Central Reserve Police Force have died after Maoists blew up their anti-landmine vehicle in poll-bound Chhattisgarh's Bijapur district today. Two other CRPF jawans were injured in the improvised explosive device or IED blast.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X