వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నలుగురు రైతుల దుర్మరణం, ఎనిమిది మందికి గాయాలు.. ఎక్కడ, ఎలా అంటే..

|
Google Oneindia TeluguNews

వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై రైతు నేతల ఆందోళన మిన్నంటుతోంది. దేశ రాజధాని మార్మోగుతోంది. అయితే ఆందోళన కోసం ఢిల్లీ వచ్చిన రైతులు తిరిగి తమ స్వస్థలాలకు బయల్దేరారు. అలా బయలుతేరగా కొందరు రైతులను ప్రమాదం కబలించింది. రోడ్డు ప్రమాదంలో నలుగురు రైతులు చనిపోయారు. పెద్ద దిక్కును కోల్పోయామని ఆ కుటుంబ సభ్యులు బోరుమని విలపిస్తున్నారు.

మంగళవారం రెండు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. దీంతో పాటియాలాకు చెందిన ఇద్దరు, మొహలి, ఫతేగఢ్ సాహిబ్‌కు చెందిన ఒక్కొక్కరు చనిపోయారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. ప్రమాదానికి గల కారణం తెలియరాలేదు. రోడ్డు ప్రమాదంపై పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ స్పందించారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందజేస్తామని తెలిపారు. ప్రమాదంలో రైతులు చనిపోయారని తెలిసి షాక్‌నకు గురయ్యానని చెప్పారు.

4 Punjab farmers killed, 8 injured in accidents..

వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతుల ఆందోళన కొనసాగుతూనే ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా చర్చలు జరుపుతోంది. క్లాజుల వారీగా సవరణలు చేసేందుకు ఓకే అని చెప్పింది. కానీ రైతు నేతలు చట్టానికి సమూలంగా సవరణలు చేయాలని కోరుతున్నారు. దీంతో పీటముడి నెలకొంది. అటు ప్రభుత్వం, ఇటు రైతు నేతలు పట్టువీడకపోవడంతో ఆందోళన కంటిన్యూ అవుతోంది.

English summary
Four Punjab farmers returning from protest sites near Delhi borders were killed in two separate road accidents.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X