వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారీభద్రత ఉన్నప్పటికీ జమ్మూ కాశ్మీర్‌లో 2రోజుల్లో 4ఉగ్రదాడులు; ఇద్దరు పోలీసులు మృతి

|
Google Oneindia TeluguNews

దేశం మొత్తం 75సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న వేళ ఉగ్రవాదుల హెచ్చరికల నేపథ్యంలో భారీ భద్రతను ఏర్పాటు చేసినప్పటికీ జమ్మూకాశ్మీర్లో గత రెండు రోజుల్లో నాలుగు దాడులు జరిగాయి. ఒక్క ఆగస్ట్ 15 స్వాతంత్ర్య దినోత్సవం నాడే రెండు ఉగ్రదాదులు జరిగాయి. గత రెండు రోజుల్లో ఉగ్రవాదుల దాడులలో ఇద్దరు పోలీసులు మృతి చెందారు. భద్రతా సిబ్బంది ఉగ్రమూక కుట్రలను చేదించటానికి చాలా కష్టపడ్డారు.

 దేశ భద్రతా వ్యవస్థకు పెను సవాల్ విసిరిన ఉగ్రవాదులు

దేశ భద్రతా వ్యవస్థకు పెను సవాల్ విసిరిన ఉగ్రవాదులు

దేశ భద్రతా వ్యవస్థకు ఉగ్రవాదులు పెను సవాల్ విసురుతున్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల దృష్ట్యా జమ్మూ కాశ్మీర్‌లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి, హై అలర్ట్ ఉన్నప్పటికీ ఆది, సోమవారాల్లో రెండు రోజుల పాటు జరిగిన నాలుగు దాడుల్లో ఇద్దరు పోలీసులు మరణించడం ఉగ్రవాదులు ఎంతగా పెట్రేగి పోతున్నారో తెలియజేస్తుంది. ఇక గత రెండు రోజుల్లో జరిగిన నాలుగు ఘటనలలో ఒక పౌరుడితో సహా మరో ఇద్దరు సామాన్యులు కూడా గాయపడ్డారు.

పోలీస్ కంట్రోల్ రూమ్ పై దాడి.. ఆపై గంట వ్యవధిలోనే గోపాల్ పోరా ప్రాంతంలో దాడి

పోలీస్ కంట్రోల్ రూమ్ పై దాడి.. ఆపై గంట వ్యవధిలోనే గోపాల్ పోరా ప్రాంతంలో దాడి

శ్రీనగర్‌లోని కీలక సదుపాయమైన జమ్మూ & కాశ్మీర్ పోలీస్ కంట్రోల్ రూమ్‌పై గ్రనేడ్ దాడి చేయడంతో ఒక పోలీసు గాయపడ్డాడు. భారీ భద్రతా వ్యవస్థ ఉన్నా ఎలాంటి భయం లేకుండా ఉగ్రవాదులు దాడులకు యత్నించారు. అంతకుముందు సాయంత్రం, బుద్గామ్‌లోని గోపాల్‌పోరా చదూరా ప్రాంతంలో ఉగ్రవాదులు గ్రెనేడ్ విసిరారు. ఇందులో కరణ్ కుమార్ సింగ్ అనే ఒక పౌరుడు గాయపడ్డాడు.

ఆదివారం పోలీసులకు ఉగ్రమూకకు ఎదురుకాల్పులు.. గాయపడిన కానిస్టేబుల్ మృతి

ఆదివారం పోలీసులకు ఉగ్రమూకకు ఎదురుకాల్పులు.. గాయపడిన కానిస్టేబుల్ మృతి

శ్రీనగర్‌లోని నౌహట్టా వద్ద ఆదివారం రాత్రి జరిగిన ఎదురుకాల్పుల్లో గాయపడిన ఒక పోలీసు కానిస్టేబుల్ గాయాలతో సోమవారం నాడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఆదివారం రాత్రి నౌహట్టా వద్ద జరిగిన కాల్పుల్లో ఒక స్కూటర్, ఒక రైఫిల్ మరియు రెండు గ్రెనేడ్‌లను స్వాధీనం చేసుకున్నామని, అవి ఇద్దరు ఉగ్రవాదులకు చెందినవని పోలీసులు తెలిపారు. షూట్ అవుట్‌లో ఇద్దరిలో ఒకరు గాయపడ్డారని, అయితే చీకటిగా ఉండటంతో వారు తప్పించుకుని పారిపోయారని పేర్కొన్నారు. ఇద్దరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఉగ్రవాదులకు స్కూటర్‌ను అందించినందుకు శ్రీనగర్‌ వాసిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

లష్కరే తోయిబా కు చెందిన ఉగ్రవాదులుగా గుర్తింపు.. కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్

లష్కరే తోయిబా కు చెందిన ఉగ్రవాదులుగా గుర్తింపు.. కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్


సాయంత్రం శ్రీనగర్ సమీపంలోని గోపాల్‌పోరా వద్ద జరిగిన గ్రెనేడ్ దాడిలో మరో పౌరుడు గాయపడ్డాడు. దాడి చేసిన వారి గురించి తమకు ఆధారాలు ఉన్నాయని, వారు లష్కరే తోయిబాతో సంబంధం కలిగి ఉన్నారని దర్యాప్తు అధికారి తెలిపారు. ఈ దాడుల వెనుక ఉన్న వ్యక్తులను త్వరలో అరెస్టు చేస్తామని పోలీసు అధికారులు పేర్కొన్నారు. చాలా పటిష్టమైన భద్రత ఉన్నా ఉగ్రమూక దాడులకు ప్రయత్నం చేసిన తీరు ఆందోళన కలిగిస్తుంది. చాప క్రింద నీరులా విస్తరిస్తున్న ఉగ్రవాదం దేశాభివృద్ధికి విఘాతంగా మారింది.

English summary
4 terror attacks took place in 2 days in Jammu and Kashmir despite heavy security. Two policemen were killed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X