వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉగ్రశిబిరాలపై భారత ఆర్మి మరోదాడి..భారీగా ప్రాణనష్టం...?

|
Google Oneindia TeluguNews

పాకిస్తాన్ కాల్పులకు ప్రతికారంగా భారత ఆర్మీ రంగంలోకి దిగింది. శనివారం పాకిస్తాన్ ఆర్మీ దళాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కుప్వారా జిల్లాలోని ఇద్దరు ఆర్మీ జవాన్లతో పాటు మరో పౌరుడు చనిపోయారు. దీంతో పాకిస్తాన్ చర్యలకు దీటుగా భారత బలగాలు రంగంలోకి దిగాయి. ఇందులో భాగంగానే ఆదివారం ఉదయం పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోలోని ఉగ్రవాద శిబిరాలు, మరియు టెర్రర్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసింది.

సోమవారం నుంచి స్కూళ్లు ప్రారంభం.. సెలవులు పొడిగింపు ప్రచారం ఉత్తిదే.. ఎగ్జామ్స్ ఎప్పుడంటే..!సోమవారం నుంచి స్కూళ్లు ప్రారంభం.. సెలవులు పొడిగింపు ప్రచారం ఉత్తిదే.. ఎగ్జామ్స్ ఎప్పుడంటే..!

పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని తాంగ్ధార్ సెక్టార్‌ ప్రాంతంలోని నీలం ఘాట్ ప్రాంతంలో ఆర్మీ ఉగ్రవాద శిబిరాలను నాశనం చేసేందుకు పూనుకుంది. పాకిస్తాన్ నుండి చోరబాట్లు వస్తున్న నేపథ్యంలోనే వాటిని అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేసింది. ఇందుకోసం భారత ఆర్మి పెద్ద ఎత్తున ఆయుధాలను ఉపయోగించింది. దీంతో పీవోకేలోని నాలుగు టెర్రర్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసింది. భారత కాల్పుల్లో పదిహేను మంది తీవ్రవాదులు కూడ ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం అయితే దీనిపై ఆర్మి ఆధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

 4 terror launch pads destroys by Indian Army in PoK

ఆదివారం ఉదయం నుండి భారత ఆర్మి పాకిస్తాన్ ఉగ్రశిబిరాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగారు ఇందుకోసం ఫిరంగులను సైతం ఉపయోగించినట్టు తెలుస్తోంది. దీంతో పెద్దఎత్తున ప్రాణ నష్టం జరిగినట్టు సమాచారం. కాగా గత వారం రోజులుగా పాకిస్తాన్ దళాలు అక్రమంగా భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నాలు చేస్తుంది. దీంతో పలుసార్లు కాల్పులు జరిపింది. దీన్ని అడ్డుకునేందుకు భారత్ ప్రతికార చర్యలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది.

English summary
four terror launch pads in Neelam valley in Pakistan Occupied Kashmir have been targeted and destroyed by the Indian Army.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X