వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాలుగేళ్ల మోడీ పాలన: చిక్కుల్లో ఉన్న ప్రవాస భారతీయులకు విదేశాంగ శాఖ చేయూత

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా వివిధ శాఖల పనితీరు గురించి చర్చ జరుగుతోంది. ముఖ్యంగా విదేశాంగ పనితీరు అభినందనీయంగా ఉందని చెప్పవచ్చు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ప్రపంచంలో ఏ మూలనైనా భారతీయులు కష్టాల్లో ఉన్నామంటే వారికి తగిన సాయం, చేయూతనిస్తూ విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఆ శాఖకు వన్నెతెచ్చారు.

ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో చిక్కుకున్న సుమారు 10వేల మంది భారతీయులను సురక్షితంగా తీసుకురావడంలో సుష్మా స్వరాజ్ సఫలీకృతులయ్యారు. డోక్లాం సమస్య పరిష్కారానికి కూడా ఈ మంత్రిత్వ శాఖ తనదైన పాత్ర పోషించింది. డోక్లాం వద్ద ఎలాంటి మార్పులు అంగీకరించబడవని మంత్రి సుష్మాస్వరాజ్ స్పష్టం చేశారు.

 4 years of Modi govt: When MEA provided healing touch to Indians trapped abroad

గత నెలలో ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ అనధికార సమావేశం జరిగింది. రెండు దేశాలు పరస్పర విశ్వాసాలతో ఉండాలని ఈ సమావేశంలో నిర్ణయించుకోవడం జరిగింది. మోడీ, జీ జిన్‌పింగ్‌ల సమావేశం విజయవంతంగా జరిగిందని మంత్రి తెలియజేశారు.

మోడీ ప్రభుత్వం నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్నందున సుష్మా స్వరాజ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. 'రెండు దేశాలు యుద్ధం చేసుకుంటే తప్ప డోక్లాం సమస్యకు పరిష్కారం లభించదని అంతా అనుకున్నారు. కానీ, చర్చలు, దౌత్యం ద్వారా ఇరు దేశాలు ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకున్నాయి' సుష్మా అని తెలిపారు.

'డోక్లాం వద్ద ఎలాంటి మార్పు రాలేదు. పరిస్థితి అలాగే కొనసాగుతోంది' మంత్రి సుష్మా తెలిపారు. కైలాష్ మానససరోవరం సరస్సులో భారత భక్తులు స్నానం చేసేందుకు చైనా అనుమతి నిరాకరించింది. వెంటనే స్పందించిన మంత్రి సుష్మా.. ఇది సరైన పద్ధతి కాదని చైనాకు తేల్చి చెప్పారు. స్నానం చేసేందుకు అక్కడ ఏర్పాట్లు చేయడం జరిగిందని భక్తులను స్నానం చేసేందుకు అనుమతించాలని చైనాను కోరారు. సరస్సులో ఎక్కడైనా స్నానం చేయవచ్చని అన్నారు.

మోడీ, జీ జిన్‌పింగ్ సమావేశం లక్ష్యం రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలను మరింత బలోపేతం చేయడానికేనని మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. ప్రపంచ సమస్యలతోపాటు ఇరు దేశాల మధ్య విశ్వాసాలను పెంచుకోవడం జరిగిందని చెప్పారు. 'వివిధ అంశాలపై చర్చించడానికి మీరు ఎప్పుడు మాట్లాడదామనుకుంటే అప్పుడు తనకు ఫోన్ చేయండి' అని జీ జిన్‌పింగ్ ప్రధాని మోడీకి చెప్పినట్లు తెలిపారు.

సంక్షోభ సమయంలో తరలింపు:

- 2014 కాలంలో ఉక్రెయిన్ నుంచి 1,100 మంది ప్రజలను, లిబియా నుంచి 3,750మందిని, ఇరాక్ నుంచి 7,200మందిని తరలించడం జరిగింది.

- 2015 కాలంలో యెహన్ నుంచి 6,710మంది ప్రజలను(ఇందులో 4,748మంది భారతయులు), 2016కాలంలో సౌత్ సూడాన్ నుంచి 1,500మందికిపైగా సురక్షితంగా తరలించడం జరిగింది.

- 2016లో సౌదీ అరేబియా నుంచి 1500మందికిపై భారతీయులను స్వదేశానికి తరలించడం జరిగింది.

పాస్టర్స్, ఇమాన్‌లను తీసుకురావడం:

- ఫాదర్ అలెక్స్ ప్రేమ్ కుమార్, జుడిత్ డీసౌజా ఆఫ్ఘనిస్థాన్ నుంచి తీసుకురావడం.
- కేరళకు చెందిన సిస్టర్ సాల్లీని సంక్షోభం నుంచి కాపాడి యెమన్ నుంచి తీసుకురావడం.
- మత పెద్దలు సయీద్ అసిఫ్ అలీ నిజామీ, అతని మేనల్లుడు నజీమ్ అలీ నిజామీలను పాకిస్థాన్ నుంచి తీసుకురావడం.

- 180కిపైగా దేశాల్లో ఈ-వీసా సౌకర్యం కల్పించడం.

English summary
The Ministry for External Affairs has been in the news for long. In the run-up to the fourth year in office, the Ministry has faced several challenges and the toughest being bringing Indians back from war torn areas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X