వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

lockdown: పరిమళించిన మానవత్వం, క్యాన్సర్ రక్కసితో పోరాడుతోన్న చిన్నారి, 150 కి.మీ బైక్‌పై వెళ్లి..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ లాక్‌డౌన్ సమయంలో రోగులు ఇబ్బంది పడుతున్నారు. మందులు స్టాక్ పెట్టుకొని వారి సమస్యలు అన్నీ ఇన్నీ కావు. కేరళలో చిన్నారి క్యాన్సర్ వ్యాధితో పోరాడుతోంది. కానీ పేరంట్స్ సరిపడ మందులు స్టాక్ చేయలేదు. దీంతో పక్కన ఉండే వ్యక్త తన మానవత్వాన్ని చాటుకొన్నాడు. మందుల కోసం టూవీలర్‌పై 150 కిలోమీటర్లు ప్రయాణించి మరీ తీసుకొచ్చి.. చిన్నారి ప్రాణాలను నిలిపారు.

 బ్లడ్ క్యాన్సర్..

బ్లడ్ క్యాన్సర్..

కేరళలోని అలప్పుజకు చెందిన నాలుగేళ్ల నూర్ (పేరు మార్చం) బ్లడ్ క్యాన్సర్ రక్కసితో బాధపడుతున్నారు. తిరువనంతపురంలోని రీజనల్ క్యాన్సర్ సెంటర్‌కు తీసుకెళ్లి కిమోథెరపి నిర్వహించేవారు. కానీ మార్చిలో లాక్ డౌన్ విధించడంతో కిమోథెరపి ఆగిపోయింది. కిమోథెరపీ చేయనందన.. మందులు వాడుకోవాలని వైద్యులు సూచించారు. అయితే వారి వద్ద సరిపడ మందులు కూడా లేకపోవడంతో సమస్య తలెత్తింది. అలప్పుజ జిల్లాలో మందుల కోసం తిరిగి తిరిగి ఆలసిపోయారు.

విష్ణు రూపంలో..

విష్ణు రూపంలో..

నూర్ కుటుంబాన్ని ఆదుకునేందుకు ఒకరు ముందుకొచ్చారు. చిన్నారి తెలియకపోయినా.. మందులు అవసరం ఉన్నాయని కేపీ విష్ణు అనే అతను మానవత్వాన్ని చాటుకున్నాడు. అలప్పుజ నుంచి తిరువనంతపురం మెడికల్ కాలేజీ హాస్పిటల్‌కు వెళ్లి మందులు తీసుకొచ్చారు. 150 కిలోమీటర్లు ప్రయాణించి.. తన సొంత డబ్బులతో మందులు కొనుగోలు చేశాడు. తర్వాత వారికి మందులు అందజేయడంతో కుటుంబం ఆపద నుంచి బయటపడింది.

రతీష్ చెప్పడంతో..

రతీష్ చెప్పడంతో..

నూర్ పొరుగున అలప్పుజ నార్త్ స్టేషన్‌లో పనిచేసే ఆఫీరస్ రతీష్ ఉంటారు. నూర్ ఆరోగ్యం గురించి మార్చి 30వ తేదీన ఆమె తల్లి రతీష్‌తో చెప్పింది. కానీ తమ వద్ద మందులు లేవని పేర్కొన్నది. దీంతో వెంటనే తన పొరుగున ఉండే విష్ణుతో మాట్లాడారు. అతను తిరువనంతపురం మెడికల్ కాలేజీలో పనిచేస్తున్నారు. అతనికి విషయం చెప్పగా స్పందించాడని పేర్కొన్నారు. వాస్తవానికి మార్చి 30వ తేదీన తిరువనంతపురం చేరుకొని.. అక్కడే గల మెడికల్ కాలేజీలో అతను వారం రోజులపాటు విధులు నిర్వర్తించాలి. కానీ నూర్ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని.. మందులు కొనుగోలు చేసి.. తీసుకొచ్చాడని పేర్కొన్నారు.

సొంత డబ్బులతో

సొంత డబ్బులతో

ముందుగా తాను చెప్పినట్టు కొల్లమ్ వరకు తీసుకురావాలి.. కానీ ఎక్కడో చిన్న అనుమానం మరునాడు ఉదయం నూర్ కుటుంబసభ్యులకు మందులు అందజేశాడు. ఇందుకోసం అతను రెండు జిల్లాలు దాటి 150 కిలోమీటర్లు ప్రయాణించారని రతీష్ పేర్కొన్నాడు. మందులు తీసుకొచ్చిన రోజు విష్ణు అక్కడే ఉండి.. మరునాడు తిరువనంతపురం వెళ్లాడని రతీష్ తెలిపారు.

Recommended Video

India Vs West Indies 2019 : Mumbai And Hyderabad Swap Dates Of T20Is Against Windies || Oneindia
మరవం.. మీ మేలు

మరవం.. మీ మేలు

లాక్ డౌన్ ఉన్న సమయంలో క్యాన్సర్‌తో పోరాడుతున్న నూర్‌కు విష్ణు రూపంలో సాయం అందింది. తాను నమాజ్ చేసే సమయంలో ఇతరుల గురించి ఆలోచిస్తానని.. అల్లా వారిని ఎప్పుడూ ఆశీర్వదిస్తాడని నూర్ తల్లి పేర్కొన్నది. తమకు మందులు అందజేసిన విష్ణును కొనియాడింది.

English summary
4-yr-old girl noor runs out of cancer drugs, Kerala man vishnu rides 150 km to deliver it
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X