వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెక్కీలకు షాక్: కాగ్నిజెంట్‌లో భారీగా ఉద్యోగుల్లో కోత, ఏటా 60 మిలియన్ డాలర్ల ఆదా

టెక్కీలకు షాక్ ఇచ్చే వార్తే ఇది. సాఫ్ట్‌వేర్ సంస్థలన్నీ ఖర్చులను తగ్గించుకొనే పనిలో ఉన్నాయి.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: టెక్కీలకు షాక్ ఇచ్చే వార్తే ఇది. సాఫ్ట్‌వేర్ సంస్థలన్నీ ఖర్చులను తగ్గించుకొనే పనిలో ఉన్నాయి. ఇందులో భాగంగానే ఐటీ సేవల దిగ్గజం కాగ్నిజెంట్ 400 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు ఉద్వాసన పలికింది. 9 నెలల వేతనంతో స్వచ్ఛంధ ఉద్యోగ విరమణకు ఈ ఉద్యోగులు అంగీకరించారని కాగ్నిజెంట్ ఆదివారం నాడు ప్రకటించింది.

కాగ్నిజెంట్ సంస్థలో ప్రపంచవ్యాప్తంగా 2.5 లక్షల మంది ఉద్యోగులున్నారు .స్వచ్ఛంద ఉద్యోగవిరమణ పథకానికి ఇటీవలనే కాగ్నిజెంట్ శ్రీకారం చుట్టింది. ఈ పథకంలో భాగంగా స్వఛ్చందగా ఉద్యోగాన్ని వదులుకొనేవారికి 9 మాసాల వేతనాన్ని ఇవ్వనున్నట్టు ప్రకటించింది.

టెక్కీలకు షాక్: 9 నెలల జీతంతో సీనియర్లను తొలగించనున్న కాగ్నిజెంట్టెక్కీలకు షాక్: 9 నెలల జీతంతో సీనియర్లను తొలగించనున్న కాగ్నిజెంట్

అయితే కాగ్నిజెంట్ ప్రకటించిన ఈ స్వచ్చంద ఉద్యోగ విరమణ పథకానికి 400 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లలో ఎక్కువమంది భారత ఉద్యోగులేనని అభిప్రాయాలు కూడ లేకపోలేదు. అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

400 executives accept Cognizant's voluntary separation package

అయితే ఈ ఆఫర్‌ను ఆమోదించిన భారత ఎగ్జిక్యూటివ్‌లు ఎంతమంది ఉన్నారనే విషయమై కాగ్నిజెంట్ మాత్రం వెల్లడించలేదు.వీరంతా కంపెనీ నుండి బయటకు వెళ్ళిపోవడంతో ప్రతి ఏటా ఈ కంపెనీకి 60 మిలియన్ డాలర్లు ఆదా అవుతాయని కాగ్నిజెంట్ సీఎప్ఓ కరెన్ మెక్లీన్ ప్రకటించారు.

ఉద్యోగులపై వేటు కారణంగా కంపెనీ లాభాలు పెరిగే అవకాశాలున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. సామర్థ్య మదింపు, వీఎస్‌పీ కారణంగా తమ సంస్థలో ఉద్యోగుల నిష్క్రమణ అత్యధికంగా ఉందని తెలిపారు.

English summary
About 400 senior executives of Cognizant have accepted the company's voluntary separation package (VSP), a move that the US-based company said will help it save about $60 million annually.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X