వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

lockdown: 400 కుటుంబాలకు అందని రేషన్, రోడ్డెక్కిన వందలాది మంది, మాస్క్ మరిచి ఆందోళన..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ విజృంభించడంతో నిరుపేదలకు పని లేదు. వారికి రేషన్‌తోపాటు కొంతమొత్తం నగదు ఇస్తామని చెబుతోన్న కొన్నిచోట్ల అమలు కావడం లేదు. పశ్చిమబెంగాల్‌లోని డొమకల్ మున్సిపాలిటీలో కూడా పేదలకు సరుకులు అందలేదు. దీంతో ఆగ్రహించిన వారు.. రోడ్డెక్కి నిరసన చేపట్టారు. 400 కుటుంబాలు రహదారి మీద బైఠాయించడంతో ఉద్రిక్తత నెలకొంది.

కొరత లేదు..

కొరత లేదు..

రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల కొరత లేదని సీఎం మమతా బెనర్జీ స్పష్టంచేశారు. పేదలకు ఉచితంగా అందజేసే సరుకులకు లోటులేదని పేర్కొన్నారు. కానీ గత 20 రోజుల నుంచి డొమకల్ మున్సిపాలిటీలోని కొన్ని కుటుంబాలకు సరుకులు మాత్రం అందడం లేదు. దీంతో బుధవారం ఉదయం బెర్హమ్‌పూర్ డొమకల్ రహదారి మీద బైఠాయించారు. వారిలో చాలామంది మహిళలు, చిన్నారులు ఉన్నారు. అయితే వారు మాస్క్ ధరించకపోవడం, సోషల్ డిస్టన్స్ పాటించకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

ఇవ్వని డీలర్లు..

ఇవ్వని డీలర్లు..

తమకు అందజేయాల్సిన సరుకులను రేషన్ డీలర్లు ఇవ్వడం లేదని పేదలు ఆరోపించారు. ఒక్కో ఆహార భద్రతా కార్డుదారునికి ఐదో కిలోల బియ్యం, ఐదు కిలోల పిండిని ప్రభుత్వం ఉచితంగా అందజేస్తోంది. కానీ డొమకల్‌లో మాత్రం పేదలకు పంపిణీ చేయడం లేదు. ఒక్కో కిలో బియ్యం ఇచ్చి డీలర్లు చేతులు దులుపుకుంటున్నారు. అయితే రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల కొరత లేదని బెంగాల్ పౌరసరఫరాల మంత్రి జ్యోతిప్రియ మాలిక్ తెలిపారు.

సరిపడ బియ్యం..

సరిపడ బియ్యం..

ప్రస్తుతం 9.45 మెట్రిక్ టన్నుల బియ్యం తమ వద్ద ఉంది అని.. మరో 4 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం రైస్ మిల్లర్ల వద్ద ఉన్నాయని తెలిపారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి బియ్యాన్ని బెంగాల్ ప్రభుత్వం సేకరించదని.. ఆగస్ట్ వరకు సరిపడ సరుకులు ఉన్నాయని తెలిపారు. అవసరమనుకుంటే రైతుల నుంచి బియ్యం కొనుగోలు చేస్తామని చెప్పారు. కొందరు రేషన్ డీలర్లు సరుకులు అందజేయడం లేదనే అంశం తమ దృష్టికి వచ్చిందని మంత్రి తెలిపారు. వారు షాపు కూడా తెరవడం లేదు అని గుర్తించామని.. వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.

పదో వార్డులో ఇది పరిస్థితి..

పదో వార్డులో ఇది పరిస్థితి..


డొమకల్ మున్సిపాలిటీ పదో వార్డులో డీలర్ తమకు సరుకులు అందజేయడం లేదని స్థానికుడు మహబూబ్ దాస్ తెలిపారు. గత రెండువారాల నుంచి కుటుంబానికి కిలో బియ్యం అందజేస్తున్నారు.. ఐదుగురు సభ్యులు ఉన్న ఫ్యామిలీ ఎలా గడపాలి అని ప్రశ్నించారు. ఇక్కడ నివసించే చాలా మంది రోజువారీ కూలీ పనిచేసుకుంటున్నారు. లాక్ డౌన్ వల్ల ఉపాధి పోయిందని.. దీంతో తమకు ఆహారం అందజేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని పేదలు స్పష్టంచేశారు.

చనిపోవాలా...?

చనిపోవాలా...?

పనిచేయడానికి ప్రభుత్వం అనుమతించడం లేదు.. మరి మేం చనిపోవాలా అని మరో ఆందోళనకారుడు సుదోబ్ దాస్ ప్రశ్నించారు. తమ ఆందోళనతో ఇతరులకు ఇబ్బంది కలుగుతోంది.. కానీ తమకు నిరసన తప్ప మరో మార్గం కనిపించడం లేదు అని తెలిపారు. ఘటనాస్థలానికి వచ్చిన టీఎంసీ మున్సిపల్ చైర్మన్ ఇస్లాం.. ఆందోళనకారులకు నచ్చజెప్పి.. ఆందోళనను విరమింపజేశారు.

Recommended Video

Shane Watson To Interview West Indies Legendary Cricketer Viv Richards
40 క్వింటాళ్లు..

40 క్వింటాళ్లు..


డొమకల్‌లో 69 శాతం మంది 1.57 లక్షల మంది ప్రజలు బీపీఎల్ కుటుంబాలేనని స్పష్టంచేశారు. ప్రభుత్వం నుంచి 42 క్వింటాళ్ల రైస్ అందిందని.. మరింత రావాల్సి ఉంది అని ఇస్లాం పేర్కొన్నారు. స్థానిక రేషన్ డీలర్ అర్హులకు రేషన్ ఇవ్వడం లేదు అని తన దృష్టికి వచ్చిందని.. అతనిపై కఠినచర్యలు తీసుకుంటామని ఇస్లాం స్పష్టంచేశారు. ప్రతీ కుటుంబానికి 10 కిలోల బియ్యం, 5 కిలోల బంగాళదుంప అందజేస్తానని హామీనిచ్చానని పేర్కొన్నారు.

English summary
Hundreds of people from the Domkal municipality area state highway for three hours on Wednesday morning, alleging that they did not get food in 20 days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X