• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Master plan:కరోనా క్రీమ్, కరోనా లైఫ్ పేర్లతో పోర్న్ వీడియోలు, పాపం ఐటీ ఉద్యోగులు, పోలీసులు పిండేశారు

|

తిరువనంతపురం/ న్యూఢిల్లీ/ చెన్నై: కరోనా వైరస్ (COVID-19) పుణ్యమా అంటూ దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలు కావడంతో ఆ కాలంలో యువత ఆన్‌లైన్‌ లో, సోషల్‌ మీడియాలో కాలం గడిపేసింది. కరోనా కాలంలో ఇంటర్నెట్ వినియోగం విపరీతంగా పెరిగిపోవడంతో కొన్ని మొబైల్ నెట్ వర్క్ సంస్థలు పండగ చేచసుకున్నాయి. కొందరు ఐటీ ఉద్యోగులు కరోనా క్రీమ్, కరోనా లైఫ్ పేర్లతో పిల్లల పోర్న్ వీడియోలు షేర్ చెయ్యడంతో వారిని పోలీసులు పిండేశారు. యువత రోజులో కొన్ని గంటల సమయం ఆన్‌లైన్‌లోనే కాలం గడిపేసి పోర్న్ వీడియోలు చూస్తూ లాక్ డౌన్ కాలం గడిపేశారు. కరోనా కాలంలో యువత చెడు వ్యసనాలకు బానిసలు అయ్యారని వెలుగు చూసింది. ఈ క్రమంలో చిన్న పిల్లల ఆశ్లీల వీడియోలు, ఫోటోలను ఆన్‌లైన్‌లో షేర్‌ చేసినందుకు కేరళలో కొందరు కామాంధులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

MLA love marriage: ఎమ్మెల్యే 39, కాలేజ్ అమ్మాయి 19, ఆత్మహత్యాయత్నం, 10 ఏళ్లు లవ్!

 ఐటీ, కార్పోరేట్ కంపెనీల ఉద్యోగులు

ఐటీ, కార్పోరేట్ కంపెనీల ఉద్యోగులు

కేరళలో సోషల్ మీడియాలో, పోర్న్ వెబ్ సైట్లలో ఎక్కువ మైనర్ల అశ్లీల చిత్రాలు చూసిన వారిలో ఎక్కువ మంది ఐటీ ఉద్యోగులు, వివిధ కార్పోరేట్ కంపెనీల్లో ఉద్యోగాలు చేసే వారే ఉన్నారని పోలీసు అధికారులు అంటున్నారు. వీళ్లు ఏం చేశారు ?, ఏం చూశారు ? అనే విషయం వెలుగు చూడటంతో సాటి ఉద్యోగులు హడలిపోయారని తెలిసింది.

 ఐటీ స్కెచ్ కు హైటెక్ దర్యాప్తు

ఐటీ స్కెచ్ కు హైటెక్ దర్యాప్తు

కరోనా కాలంలో మైనర్ అమ్మాయిలపై లైంగిక దౌర్జన్యాలు ఎక్కువ అయ్యాయని ఫిర్యాదులు రావడంతో కేరళ సైబర్ క్రైమ్ పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేశారు. కేరళ పోలీసుల ఆధ్వర్యంలో సైబర్ డోమ్ సహాయంతో హైటెక్ దర్యాప్తు కొనసాగింది. ఈ హైటెక్ దర్యాప్తులో చిన్న పిల్లల పోర్న్ వీడియోలు చూసి ఆ వీడియోలు, ఫోటోలు షేర్ చేసిన 41 మందిని కేరళ పోలీసులు అరెస్టు చేశారు.

 వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్ స్టాగ్రామ్

వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్ స్టాగ్రామ్

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ పేరు ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనా లైఫ్, కరోనా స్కీమ్ తదితర పేర్లతో వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్, టెలిగ్రామ్ తదితర ఫ్లాట్స్ ఫామ్స్ లో కొందరు కామాంధులు చిన్నపిల్లల అశ్లీల చిత్రాలు వీక్షించడంతో పాటు వాటిని ఎవరికంటే వాళ్లకు షేర్ చూస్తూ పైచాచిక ఆనందం పోందారని కేరళ పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

 360 ప్రాంతాల్లో 3D సినిమా

360 ప్రాంతాల్లో 3D సినిమా

కేరళ పోలీసులు 360 ప్రాంతాల్లో నిర్వహించిన దాడుల్లో చిన్నపిల్లల ఆశ్లీల వీడియోలు చూసిన వాళ్లు, ఆ వీడియోలు షేర్ చేసిన 268 మందిని అదుపులోకి తీసుకున్నారు. డార్క్ నెట్ లాంటి ఆన్ లైన్ ప్లాట్ ఫామ్స్ ఉపయోగించి పోర్న్ వీడియోలు చూడటం, వాటిని స్నేహితులతో పాటు గుర్తు తెలియని వ్యక్తులకు షేర్ చేశారని కేరళ పోలీసుల విచారణలో వెలుగు చూసింది. నిందితుల నుంచి మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లు, హార్డ్ డిస్క్ లు, ఎలక్ట్రానిక్ వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.

  US Election 2020 : Truump పై Kamala Harris ఉగ్రరూపం.. Mike Pence పై ఆధిపత్యం! || Oneindia Telugu
   ఐదేళ్లు జైలు, జస్ట్ రూ. 10 లక్షలు ఫైన్

  ఐదేళ్లు జైలు, జస్ట్ రూ. 10 లక్షలు ఫైన్

  సోషల్ మీడియాలో పెద్దల అశ్లీల చిత్రాలు, వీడియోలు చూసి ఎంజాయ్ చేస్తున్న వాళ్లు చాలా మందే ఉన్నారు. అయితే అన్యంపుణ్యం తెలియని పసిపిల్లల అశ్లీల వీడియోలు చూడటమే కాకుండా వాటిని ఇతరులకు షేర్ చెయ్యడాన్ని పోలీసులు చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. ఇలాంటి వాళ్లను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. నిందితులు నేరం చేసినట్లు రుజువు అయితే వారికి ఐదేళ్ల జైలు శిక్షతో పాటు ప్రతిఒక్కరికి రూ. 10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని సీనియర్ పోలీసు అధికారులు అంటున్నారు. అయితే ఈసారికి మమ్మల్ని వదిలేయాలని, ఇంకోసారి ఇలాంటి తప్పులు చెయ్యమని, మీకాళ్లు పట్టుకుంటామని కొందరు కామాంధులు పోలీసులను వేడుకుంటున్నారని తెలిసింది.

  English summary
  pornography: 41 including IT professionals, arrested for creating, sharing child porn over WhatsApp, Telegram in Kerala.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X