వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేరళలో కొండచరియల బీభత్సం.. 42 మంది మృతి.. ఆర్థికసాయం ప్రకటించిన ఫడ్నవీస్

|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం : దక్షిణాదిలో వర్ష బీభత్సం కొనసాగుతుంది. వరదనీటితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కేరళలో కొండచరియలు విరిగిపడటంతో 42 మంది చనిపోయారు. కొండచరియలు విరిగిపడి ఆచూకీ గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతుంది. మల్లప్పురంలో ఓ వ్యక్తి కళ్ల ముందే తల్లి, భార్య, కుమారుడు కొండచరియలు విరిగిపడి కురుకుపోవడం భయాందోళన కలిగించింది. కేరళలో కొండచరియలు విరిగిపడి చనిపోయిన మృతుల కుటుంబాలకు తలా రూ.5 లక్షల ఆర్థికసాయాన్ని ప్రకటించారు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్.

వర్ష బీభత్సం ..

కేరళపై ప్రకృతి పగబట్టింది. భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమయ్యారు. రాష్ట్రంలో ఏర్పాటుచేసిన 988 పునరావాస కేంద్రాలకు దాదాపు లక్ష మందిని తరలించినట్టు అధికారులు పేర్కొన్నారు. వాయనాడులో వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది. కొండచరియలు విరిగిపడి 42 మంది చనిపోయారు. వీరిలో కోజికోడ్, మలప్పురం జిల్లాలకు చెందిన వారు 20 మది ఉన్నారు. వాయనాడుకు చెందిన వారు 9 మంది ఉన్నారు. నిన్న ఎర్నాకులం, ఇడుక్కి, త్రిసూర్, పలాక్కడ్, మలప్పురం, కోజికోడ్, వాయనాడు, కన్నూరు, కేసర్ ఘడ్‌లో భారీ వర్షాలు కురిసినట్టు అధికారులు పేర్కొన్నారు. భారీ వర్షాలతో కోచి విమానాశ్రయాన్ని ఆదివారం మధ్యాహ్నం 3 గంటల వరకు మూసివేస్తున్నట్టు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. మరోవైపు 20 రైళ్లను కూడా రద్దుచేశారు. మరికొన్నింటి మార్గాలను మళ్లిస్తున్నట్టు రైల్వేశాఖ అధికారలుు వెల్లడించారు.

కళ్లముందే ..

కళ్లముందే ..

మరోవైపు మల్లప్పురంలో ఓ ఫ్యామిలీ కొండచరియలు విరిగిపడి బురదలో చిక్కుకుంది. కొట్టకున్నుకు చెందిన శరత్ ఇంటి బయట తన తల్లి సరోజనితో మాట్లాడుతున్నాడు. అంతలోనే కొండచరియలు విరిగిపడ్డాయి. తన తల్లిని కాపాడేందుకు శరత్ విశ్వప్రయత్నం చేశాడు. కానీ ఫలితం లేకపోయింది. ఆమె బురదలో చిక్కుకుపోయింది. ఇంటిపై కొండచరియలు విరిగిపడటంలో ఇంట్లో ఉన్న శరత్ భార్య గీతు, ఏడాదిన్నర కుమారుడు కూడా బురదలో చిక్కుకుపోయారు. నిన్న మధ్యాహ్నం 2 గంటలకు ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. శరత్ తల్లి, భార్య, కుమారుడు చనిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కేరళలోని మలప్పురంలో కొండచరియలు విరిగిపడి 30 మంది గల్లంతైన సంగతి తెలిసిందే. వారిని కాపాడేందుకు సిబ్బంది విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు కొండచరియలు విరిగిపడి చనిపోయిన కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు.

వడోదర వీధుల్లో మొసళ్లు

వడోదర వీధుల్లో మొసళ్లు

కేరళతోపాటు తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్‌లో కూడా భారీ వర్షాలు కురుస్తోన్నాయి. దీంతో జనం ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. వర్షపునీరుతో వడోదరలో మొసళ్లు వీధుల్లోకి వస్తున్న సంగతి తెలిసిందే. తొలుత వీటిని చూసి భయబ్రాంతుకుల గురైన జనం .. తర్వాత వాటితో ఆడుకున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరలైంది. ఓ వ్యక్తి మొసళిపై తాడుబొంత వేసి .. దానిని పట్టుకొని ఫోటోకు ఫోజిచ్చిన వీడియో తెగ ట్రెండ్ అయ్యింది.

English summary
The heavy downpour resulting into flooding and landslides has claimed 42 lives in Kerala, PTI reported. While twenty people have been killed in Kozhikode and Malappuram districts, and nine have died in Wayanad since August 8. Over one lakh people have been moved to 988 relief camps across the state. In the worst affected Wayanad where heavy rains is continuing, 24,990 persons are in relief camps.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X