• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Coronavirus: ఎగరేసుకుని వెళ్లిన పెళ్లి కొడుకు, నవదంపతులతో సహ 43 మందికి పాజిటివ్, తండ్రిపై కేసు !

|

కొచ్చి/ కాసరూగుడ/ మంగళూరు: కుమార్తె అనారోగ్యంగా ఉందని అనుమానం ఉన్నా ఆమె తండ్రి ఏ మాత్రం పట్టించుకోలేదు. ముందుగా నిర్ణయించుకున్న ముహూర్తానికి పెళ్లి చెయ్యాలని పెళ్లి కుమార్తె తండ్రి నిర్ణయించాడు. కాబోయే భార్య స్వల్ప అనారోగ్యంగా ఉందని తెలిసినా పెళ్లి కొడుకు విషయం అతని తల్లిదండ్రులకు చెప్పకుండా ఎగరేసుకుంటూ వెళ్లి పెళ్లి చేసుకున్నాడు. అంతే నవదంపతులతో పాటు పెళ్లికి హాజరైన 43 మందికి కరోనా పాజిటివ్ అని వెలుగు చూడటంతో వారికి క్వారంటైన్ లో వరుసగా వడ్డిస్తున్నారు. కరోనా వైరస్ ఇంత మందికి వ్యాపించడానికి పెళ్లి కుమార్తె తండ్రి కారణం అయ్యాడని అతని మీద పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

Lockdown: కోలీవుడ్ నటీమణులతో గెస్ట్ హౌస్ లో బిగ్ షాట్ రొమాన్స్, చేసింది చాలు పదనాయనా, అరెస్టు !

 కర్ణాటక- కేరళ బార్డర్

కర్ణాటక- కేరళ బార్డర్

కర్ణాటక- కేరళ సరిహద్దులో కాసరగూడు జిల్లా (కేరళ) ఉంది. కేరళలో, కర్ణాటకలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువ అవుతున్నాయని ఒక రాష్ట్రం మీద ఒక రాష్ట్రం ఆరోపణలు చేసుకుంటున్న సందర్బంగా సరిహద్దు ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. సామాన్యంగా ఒక రాష్ట్రంలోని ప్రజలు మరో రాష్ట్రంలోకి వెళ్లకుండా చెక్ పోస్టులోని సిబ్బంది అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

 ఢాంఢాం అంటూ పెళ్లి

ఢాంఢాం అంటూ పెళ్లి

కాసరగూడు జిల్లాకు చెందిన 23 ఏళ్ల యువతి, 25 ఏళ్ల యువకుడి పెళ్లి జులై 17వ తేదీ జరిపించాలని చాల రోజుల క్రితమే నిశ్చయం అయ్యింది. కరోనా వైరస్ సందర్బంగా లాక్ డౌన్ నియమాలు అమలులో ఉన్న సమయంలో కల్యాణపండపంలో పెళ్లి చెయ్యకూడదని నిర్ణయించారు. జులై 17వ తేదీన పెళ్లి కుమార్తె ఇంట్లోనే పెళ్లి చెయ్యాలని డిసైడ్ అయ్యారు.

 పెళ్లి కుమార్తెకు అనారోగ్యం ?

పెళ్లి కుమార్తెకు అనారోగ్యం ?

జులై 15వ తేదీన పెళ్లి కుమార్తె స్పల్వ అనారోగ్యానికి గురైయ్యిందని తెలిసింది. అయితే ముందుగా అనుకున్న ప్రకారం పెళ్లి జరగకపోతే ఇబ్బందులు ఎదురౌతాయని పెళ్లి కుమార్తె తండ్రి ఆందోళన చెందాడు. తనకు స్వల్ప అనారోగ్యంగా ఉందని పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడిని ఫోన్ చెప్పిందని తెలిసింది. అయితే ఏం కాదులో, పెళ్లి జరిగిపోతే అంతా సరిపోతుంది అంటూ పెళ్లి కుమారుడు కూడా ఈ విషయం అతని కుటుంబ సభ్యులకు చెప్పకుండా దాచిపెట్టాడని తెలిసింది.

 ఎగరేసుకుని వెళ్లిన పెళ్లి కొడుకు

ఎగరేసుకుని వెళ్లిన పెళ్లి కొడుకు

జులై 16వ తేదీన రాత్రి కుటుంబ సభ్యులను వెంటపెట్టుకున్న పెళ్లి కొడుకు ఎగరేసుకుంటూ పెళ్లి కుమార్తె ఇంటికి వెళ్లిపోయాడు. జులై 17వ తేదీన పెళ్లి కుమార్తె ఇంటిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో పెళ్లి జరిగిపోయింది. అందరూ అక్కడే భోజనాలు చేసిన బంధువులు ఎవరిపాటికి వాళ్లు వారివారి ఇళ్లకు వెళ్లిపోయారు

 క్వారంటైన్ కు 43 మంది క్యూ

క్వారంటైన్ కు 43 మంది క్యూ

పెళ్లికి హాజరైన వారు అనారోగ్యానికి గురైనారు. అంతే హ్యాపీగా భార్యతో ఎంజాయ్ చెయ్యాలని కలలుకంటున్న పెళ్లి కొడుకు గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. విషయం తెలుసుకున్న కాసరగూడు జిల్లా వైద్యశాఖ అధికారులు నవ దంపతులతో సహ పెళ్లికి హాజరైన అందరికి వైద్యపరీక్ష్లలు నిర్వహించారు. పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెతో పాటు పెళ్లికి హాజరైన 43 మందికి కరోనా పాజిటివ్ అని వెలుగు చూసింది.

 శోభనం కథ కంచికి, పెళ్లి కూతురు తండ్రి జైలుకు

శోభనం కథ కంచికి, పెళ్లి కూతురు తండ్రి జైలుకు

నవందపతులతో సహ పెళ్లికి వెళ్లిన 43 మందిని క్వారంటైన్ కు తరలించి వరుసగా చికిత్స అందిస్తున్నారు. బెడ్ రూంలో హ్యాపీగా ఎంజాయ్ చెయ్యాలని కలలుకంటున్న పెళ్లి కొడుకు క్వారంటైన్ లో తల పట్టుకున్నాడు. అంటు వ్యాధులు వ్యాపించడానికి కారణం అయ్యాడని ఆరోపిస్తూ పెళ్లి కుమార్తె తండ్రి మీద స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. నవదంపతులతో పాటు పెళ్లికి హాజరైన 43 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని కసరగూడు జిల్లాధికారులు నిర్దారించారు. ఒకేసారి ఒక్కచోట 43 మందికి కరోనా పాజిటివ్ రావడం ఇదే మొదటిసారి అని కేరళ ప్రభుత్వ అధికారులు తెలిపారు.

English summary
Coronavirus: 43 people along with newly wed couple tested positive for COVID - 19 in Kasargod, Kerala. Wedding ceremony held on 17 July 2020. Police registered a case against bride's father.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X