వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెస్టా'రెంట్ ఓపెన్ చేయాలంటే 45 డాక్యుమెంట్స్.. గన్ లైసెన్స్‌కు కేవలం 19 డాక్యుమెంట్స్..'

|
Google Oneindia TeluguNews

Recommended Video

Union Budget 2020 : Betting Legalisation Is Good For India, Says Taxation Expert

దేశ రాజధాని ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో కాల్పుల కలకలం గన్ కల్చర్‌పై చర్చకు తెర లేపింది. నిందితుడికి గన్ ఎక్కడి నుంచి వచ్చిందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అదే సమయంలో గన్ లైసెన్స్‌ విషయంలో ఉన్న లొసుగులపై కూడా చర్చ జరుగుతోంది. దీనిపై ఎకనమిక్ సర్వే ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఓ రెస్టారెంట్ ఓపెనింగ్‌ కోసం అడిగే డాక్యుమెంట్స్ కంటే గన్ లైసెన్స్ కోసం అడిగే డాక్యుమెంట్స్ తక్కువని తెలిపింది.

 ఎకనమిక్ సర్వే వివరాల ప్రకారం..

ఎకనమిక్ సర్వే వివరాల ప్రకారం..


ఎకనమిక్ సర్వే వెల్లడించిన వివరాల ప్రకారం.. ఢిల్లీలో ఓ రెస్టారెంట్ పెట్టాలంటే అక్కడి పోలీసులు 45 రకాల డాక్యుమెంట్స్ అడుగుతారు. అదే గన్ లైసెన్స్ కోసం 19 రకాల డాక్యుమెంట్స్ సమర్పిస్తే సరిపోతుంది. నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(NRAI) తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరులో ఓ రెస్టారెంట్ ఓపెన్ చేయడానికి 36 డాక్యుమెంట్స్,ముంబైలో 22 డాక్యుమెంట్స్,ఢిల్లీలో 45 డాక్యుమెంట్స్ అవసరం. అదే చైనా,సింగపూర్ లాంటి దేశాల్లో మాత్రం కేవలం నాలుగంటే నాలుగు డాక్యుమెంట్స్ ధ్రువీకరణతో రెస్టారెంట్స్‌కు లైసెన్స్ మంజూరు చేస్తారు.

ఫైర్ వర్క్స్ లైసెన్స్‌కు కేవలం 12 డాక్యుమెంట్స్

ఫైర్ వర్క్స్ లైసెన్స్‌కు కేవలం 12 డాక్యుమెంట్స్


గన్ లైసెన్స్ కోసం 19 డాక్యుమెంట్స్ అడిగే ఢిల్లీ పోలీసులు బాణసంచా,ఇతరత్రా ఫైర్ వర్క్స్ దుకాణాల కోసం మాత్రం కేవలం 12 డాక్యుమెంట్స్ మాత్రమే అడుగుతున్నట్టు ఎకనమిక్ సర్వే వెల్లడించింది. మొత్తం 10 అంశాలను ఆధారంగా చేసుకుని బిజినెస్ ఇండెక్స్ విషయంలో వరల్డ్ బ్యాంక్ ర్యాంకులను ఇస్తోందని.. ఇందులో నాలుగు అంశాల్లో భారత్ వెనుకబడి ఉందని తెలిపింది. వాటిల్లో బిజినెస్ రిజిస్టరింగ్ ప్రాపర్టీ,పన్ను చెల్లింపులు,ఎన్‌ఫోర్సింగ్ కాంట్రాక్ట్స్ వంటి అంశాలు ఉన్నాయి.

ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో భారత్..

ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో భారత్..


నాలుగు అంశాల్లో వెనకబడి ఉన్నప్పటికీ.. మరో ఆరు అంశాల్లో మాత్రం భారత్ మెరుగైన వృద్దిని సాధించినట్టు ఎకనమిక్ సర్వే తెలిపింది. నిర్మాణ అనుమతులు, విద్యుత్ కనెక్షన్, రుణాల మంజూరు,రిజిస్టరింగ్ ప్రాపర్టీ,సమస్యల పరిష్కారం వంటి విషయాల్లో భారత్ మెరుగ్గా ఉందని తెలిపింది. ప్రస్తుతం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భారత్ 63వ స్థానంలో ఉన్నట్టు చెప్పింది. 190 దేశాలకు ఇచ్చే ర్యాంకింగ్స్‌లో భారత్ గతం కంటే 14 స్థానాలను మెరుగుపరుచుకున్నట్టు చెప్పింది.

 చాలా విషయాల్లో ఇంకా మెరుగుపడాల్సి ఉంది : ఎకనమిక్ సర్వే

చాలా విషయాల్లో ఇంకా మెరుగుపడాల్సి ఉంది : ఎకనమిక్ సర్వే

బిజినెస్ ప్రారంభానికి సంబంధించి సమయం,ఖర్చులను గణనీయంగా తగ్గించనప్పటికీ ఇంకా చాలా విషయాల్లో మెరుగుపడాల్సి ఉందని ఎకనమిక్ సర్వే వెల్లడించింది. భారత ప్రభుత్వం నుంచి కంపెనీలు ఎదుర్కొంటున్న కొన్ని ప్రధాన సవాళ్లు ఉన్నాయని.. వాటిని సులభతరం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. చైనా,బ్రెజిల్,ఇండోనేషియా,న్యూజిలాండ్ లాంటి దేశాలతో పోలిస్తే భారత్ పలు అంతర్జాతీయ ప్రమాణాలను ఇంకా పెంపొందించుకోవాల్సి ఉందని తెలిపింది. అందులో ఎన్‌ఫోర్సింగ్ కాంట్రాక్ట్స్ విషయంలో భారత్ చాలా వెనుకబడి ఉందని చెప్పుకొచ్చింది. సమస్యలు,వివాదాల పరిష్కారానికి భారత్‌లో సగటున 1445 రోజుల సమయం పడితే.. న్యూజిలాండ్‌లో కేవలం 216 రోజుల్లోనే సమస్యలు పరిష్కరించబడుతున్నట్టు తెలిపింది.

English summary
Delhi Police ask almost 45 documents before giving clearance for opening an retaurant in the national capital as against only 19 to buy a gun, the Economic Survey said
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X