• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కడుపులో ఇనుము.. 3.5 కిలోల 452 వస్తువులు.. ఎలా భరించాడో పాపం..!

|

అహ్మదాబాద్‌ : అది కడుపు కాదు. అదొక జంబో ఐరన్ బాక్స్. చిన్న కడుపులో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 452 వస్తువులు దర్శనమివ్వడం విస్మయం కలిగించింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో వెలుగుచూసిన ఘటన నివ్వెరపోయేలా చేసింది. కడుపునొప్పితో బాధపడుతూ సివిల్ హాస్పిటల్‌కు వచ్చిన ఓ వ్యక్తికి సర్జరీ చేయడంతో ఆయన కడుపులోంచి 452 రకాల ఇనుప వస్తువులు బయటపడటం వైద్యులను షాక్‌కు గురిచేసింది.

అహ్మదాబాద్‌లోని మానసిక రోగుల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తికి ఈ నెల 8వ తేదీన తీవ్రమైన కడుపునొప్పితో బాధపడ్డాడు. శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బందిపడ్డాడు. దాంతో అక్కడి సిబ్బంది అతడిని స్థానిక సివిల్ హాస్పిటల్‌కు తరలించారు. డాక్టర్లు పరీక్షించి వైద్య పరీక్షలు చేయడంతో అసలు విషయం బయటపడింది. మొదట ఎక్స్‌రే తీసి కుడి శ్వాసకోశంలో పిన్ గుర్తించారు. దాన్ని తొలగించినప్పటికీ మళ్లీ కడుపునొప్పి ఉందని బాధితుడు చెప్పడంతో తిరిగి వైద్య పరీక్షలు నిర్వహించారు.

తెలంగాణలో మళ్లీ ఆ ట్రెండ్.. దిష్టిబొమ్మల దహనంతో నిరసన.. ఈసారి కేసీఆర్ వంతు..! (వీడియో)

452 metal items found in ahmedabad man stomach

మళ్లీ ఎక్స్‌రే తీయడంతో కడుపులో భారీగా ఇనుప వస్తువులు ఉన్నట్లు గుర్తించారు వైద్యులు. దాంతో ఆపరేషన్ చేయడానికి సిద్ధమయ్యారు. నలుగురు వైద్యులు దాదాపు మూడు గంటల పాటు సర్జరీ చేసి అతడి కడుపులో నుంచి మూడున్నర కిలోల బరువున్న 452 ఇనుప వస్తువులను బయటకు తీశారు. వాటిలో బోల్టులు, నెయిల్ కట్టర్, స్పార్క్ ప్లగ్ తదితర వస్తువులున్నాయి. అవన్నీ బయటకు తీయడంతో ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు డాక్టర్లు.

452 metal items found in ahmedabad man stomach

సదరు వ్యక్తికి గతంలోనే పెళ్లి అయినట్లు తెలుస్తోంది. ఆరేళ్ల వయసున్న పాప కూడా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే కొన్ని కారణాలతో భార్య అతడిని విడిచి వెళ్లిపోయింది. దాంతో అతడు మానసికంగా కుంగిపోయాడని.. ఆ క్రమంలోనే మానసిక రోగుల ఆసుపత్రిలో చేర్పించామని తెలిపారు. దాదాపు నాలుగేళ్ల నుంచి అతడు మానసిక రోగుల ఆసుపత్రిలో ఉన్నట్లు సమాచారం. అయితే సదరు వ్యక్తికి చిన్నప్పటి నుంచే ఇనుప వస్తువులు తినే అలవాటు ఉందని తెలిసినవారు చెబుతుండటం గమనార్హం.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In a bizarre incident, 452 metal items weighing almost 4kgs were found in a man's stomach after doctors performed an operation on him at a civil hospital in Ahmedabad. Apart from nail-cutters, safety pins, nuts and bolts as well as coins were some of the items that were found in his stomach. The 28-year-old man was suffering from a mental illness.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more