వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మిజోరాంలో భూకంపం: 5.1గా తీవ్రత నమోదు

|
Google Oneindia TeluguNews

ఐజ్వాల్: ఇప్పటికే దేశ రాజధానితోపాటు ఉత్తర భారత ప్రజలను వణికిస్తున్న భూకంపాలు.. ఇప్పుడు ఈశాన్య భారతాన్ని తాకాయి. తాజాగా ఆదివారం మిజోరాంలో భూకంపం చోటు చేసుకుంది. భూ కంప తీవ్రత రిక్టారు స్కేలుపై 5.1గా నమోదైంది.

Recommended Video

Earthquakes In Haryana & Mizoram వరుస భూకంపాలు.. భారత్‌కు క్లిష్ట పరిస్థితి..!!

ఐజ్వాల్‌కు ఈశాన్యం దిశగా 25 కిలోమీటర్ల దూరంలో భూకంపం వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఆదివారం సాయంత్రం 4.16 నిమిషాలకు భూ ప్రకంపనలు వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది. ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం లేదు.

5.1 magnitude earthquake rocks northeast India, epicentre in Mizoram

జూన్ 18న రాత్రి 7.29 గంటలకు మిజోరాంలోని చంపై ప్రాంతంలో భూకంపం సంభవించింది. అప్పుడు భూకంప తీవ్రత రిక్టారు స్కేలుపై 5.0గా నమోదైంది.

కాగా, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో గత కొన్ని వారాలుగా తరచుగా భూకంపాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కరోనా మహమ్మారితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు.. ఈ భూకంపాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

English summary
An earthquake of 5.1 magnitude hit the northeast region of India at around 4.16 pm on Sunday (June 21, 2020) with Mizoram's Aizawl district as the epicentre.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X