చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ ఫ్లైట్ టాయిలెట్ లో 5.6 కిలోల బంగారం... విలువ రూ. 2. 24 కోట్లు

|
Google Oneindia TeluguNews

దేశ వ్యాప్తంగా ఎయిర్ పోర్ట్ లలో భద్రతా ప్రమాణాలు ఎంతగా తీసుకున్నా, అనునిత్యం తనిఖీలు జరుగుతున్నా ఎయిర్ వేస్ మార్గంగా బంగారం అక్రమ రవాణాకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఒక్క శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో మాత్రమే కాదు , ఢిల్లీ, చెన్నై ఇలా ఎక్కడ చూసినా బంగారం పట్టుకోవటం నిత్య కృత్యమైపోయింది. కిలోల కొద్దీ బంగారం ఎయిర్ పోర్ట్ లలో పట్టుబడుతుంది. ఇక చాలా విమానాల్లో సైతం బంగారం పట్టుబడుతున్న ఘటనలు లేకపోలేదు .

అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యుడు అరెస్ట్ ... అరకిలో బంగారం స్వాధీనంఅంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యుడు అరెస్ట్ ... అరకిలో బంగారం స్వాధీనం

తాజాగా దుబాయ్ లో బయలుదేరిన ఓ విమానంలో బంగారం స్మగ్లింగ్ కు పాల్పడ్డారు ఆగంతకులు . అయితే అధికారులకు ఈ విషయం సమాచారం అందిన అనుమానంతో వారు ఆ బంగారాన్ని చెన్నైలో ల్యాండ్ అయిన ఓ విమానం టాయిలెట్ లో పెట్టి వెళ్ళిపోయారు. కస్టమ్స్ అధికారులు తనిఖీలలో 5.6 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

5.6 kg of gold in that flight toilet ... Rs. 2. 24 crores worth gold seized customs officials

దుబాయ్ నుండి చెన్నై కి బయలుదేరిన విమానంలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్టు తమకు ఫిర్యాదు అందిందని, ప్రయాణికులు ఎవరి వద్దా బంగారం లభించక పోవడంతో విమానంలో క్షుణ్ణంగా తనిఖీలు చేసినట్టు తెలిపారు. ఇక తనిఖీలలో మరుగుదొడ్డిలో దాచిన బంగారం బయటపడింది . టేపుతో చుట్టి ఉంచిన నాలుగు బండిల్స్ లో 5.6 కిలోల బంగారాన్ని కనుగొన్నారు కస్టమ్స్ అధికారులు .ఇక ఆ బంగారాన్ని సీజ్ చేశారు.

48 బంగారం కడ్డీలు ఆ బండిల్స్ లో ఉన్నాయని, వీటి విలువ సుమారు రూ. 2.24 కోట్ల వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నట్టు వెల్లడించారు. ఇంతకీ ఈ బంగారాన్ని టాయిలెట్ లో పెట్టి వెళ్ళిన వారు ఎవరు అన్న దానిపై ఎయిర్ ఫోర్ట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. రోజుకొక మార్గంలో ఎవరికి అనుమానం రాకుండా, స్మగ్లర్లు బంగారం అక్రమ రవాణాకు ప్రయత్నిస్తున్నారు. అడ్డుకట్ట వెయ్యటానికి ఎంత ప్రయత్నం చేస్తున్నా కంట్రోల్ చెయ్యటం దేశ వ్యాప్తంగా కష్టంగా మారింది.

English summary
Customs officials have recovered unclaimed gold bars worth Rs. 2.24 crore that was concealed in the rear toilet of an aircraft that arrived from Dubai on Tuesday.Acting on a tip-off that the precious metal was being smuggled in a plane from Dubai, the sleuths rummaged the flight at the airport, according to a statement.Four bundles wrapped in black adhesive tapes were found concealed in the rear toilet of the international flight, which was to fly to New Delhi in the domestic sector, it said.Forty-eight gold bars with foreign marking, weighing 5.6 kg and valued at Rs. 2.24 crore was recovered. It has been seized as unclaimed under the Customs Act and an investigation is on, the statement added.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X