వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసోంలో భూ ప్రకంపనాలు .. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 5.9 నమోదు

|
Google Oneindia TeluguNews

డిస్పూర్ : అసోం, ఈశాన్య రాష్ట్రాలపై భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దాని తీవ్రత 5.9గా నమోదైంది. ఒక్కసారిగా భూమి కంపించడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఇళ్లల్లోంచి బయటకొచ్చి .. పరుగెత్తారు. ఈ భూకంపంతో ఆస్తినష్టం అంచనా వేయాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. అయితే ప్రాణనష్టం వాటిల్లలేదని పేర్కొన్నారు. ఈ భూ ప్రకంపనాలతో భయపడాల్సిన అవసరం లేదని ప్రజలకు ధైర్యం చెప్పారు.

5.9 magnitude earthquake jolts Assam, tremors felt in entire Northeast

జోర్హాట్‌కు 170 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. 5.9 తీవ్రతతో భూకంపం వచ్చిందని పేర్కొన్నారు. భూ ప్రకంపనాలు గౌహతి, అసోంలోని మిగతా ప్రాంతాలకు వ్యాపించాయి. సరిగ్గా మధ్యాహ్నం 2.53 గంటలకు భూకంపం వచ్చిందని అధికారులు తెలిపారు. భూకంపంతో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదన్నారు. ఆస్తినష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉందని వివరించారు. మరోవైపు భూకంపం పెద్దగా ప్రభావం చూపలేదని అదికారులు చెప్పారు. 6 అంతకన్నా ఎక్కువ తీవ్రత వచ్చిన భూప్రకంపనాలు ప్రభావం చూపుతాయని తెలిపారు. అయితే భూకంపంతో అసోం, ఈశాన్య రాష్ట్రాలపై ఎఫెక్ట్ లేదన్నారు.

English summary
earthquake measuring 5.9 Richter scale rattles Northeast. The epicentre of the quake is reportedly 170 kilometres northwest from Jorhat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X