వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హమ్మయ్యా.. ఎట్టకేలకు ఐదుగురు భారతీయులను అప్పగించిన చైనా..

|
Google Oneindia TeluguNews

డ్రాగన్ చైనా అదుపులో ఉన్న ఐదుగురిని భారత్‌కు అప్పగించింది. అరుణాచల్ ప్రదేశ్‌కి చెందిన ఐదుగురు వేటగాళ్లు ఈ నెల 1వ తేదీన కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. 2వ తేదీన వాస్తవధీన రేఖ దాటి వెళ్లిన వీరిని చైనా తిరిగి అప్పగిస్తోందని భారత ఆర్మీ ప్రకటించింది. చెప్పినట్టే ఇవాళ ఉదయం వారిని అప్పగించింది. వారు కిబిధు సరిహద్దు పోస్టు గుండా అరుణాచల్ ప్రదేశ్‌ చేరుకోనున్నారు.

Recommended Video

#IndiaChinaFaceOff : అపహరించిన ఐదుగురు భారత పౌరులను Indian Armyకి అప్పగించిన China || Oneindia

ఇండో టిబెటన్ భద్రతా దళాలు స్థానికుల సాయం తీసుకుంటారు. అవసరమైన సామాగ్రి, మెక్ మోహన్ రేఖ వెంట ఉన్న సైనిక స్థావరాలను చేర్చేందుకు సహాయం తీసుకుంటారు. అరుణాచల్ ప్రదేశ్‌లో సుబన్ సిరి జిల్లా కేంద్రం నుంచి 120 కిలోమీటర్ల దూరంలో గల నాచో ప్రాంతానికి కొందరు తప్పిపోయిన సంగతి తెలిసిందే. సరిహద్దు వెంట వారిని చైనా సైన్యం కిడ్నాప్ చేసింది. ఫ్యామిలీ మెంబర్స్ ఆర్మీకి ఫిర్యాదు చేసింది. డ్రాగన్ స్పందించలేదు. కానీ తర్వాత తమ వద్దే ఉన్నారని తెలిపింది.

5 arunachal pradesh men handed over to india..

ఘటనపై తొలుత చైనా స్పందించలేదు. కానీ తర్వాత తమ వద్దే ఉన్నారని అంగీకరించింది. శనివారం భారత్‌కు అప్పగించనున్నట్టు ప్రభుత్వానికి సమాచారం అందజేసి.. అప్పగించింది. ఇటీవల భారత భూభాగంలోకి వచ్చిన ముగ్గురు చైనీయులను ఆర్మీ కాపాడింది. దుస్తులు, ఆహారం అందించి తిరిగి వెళ్లేందుకు దారి చూపింది. ఈ క్రమంలో భారత్‌కు చెందినవారిని తిరిగి పంపించకుంటే అంతర్జాతీయ సమాజం ముందు విమర్శలకు గురవుతామని భావించి.. విడిచిపెట్టి ఉంటుందని పలువురు అంటున్నారు.

English summary
5 arunachal pradesh men handed over to india
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X