వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ ఐదుగురు భారతీయులను అప్పగించనున్న డ్రాగన్: కేంద్రమంత్రి కిరణ్ రిజిజు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: వారం రోజుల క్రితం సరిహద్దులోకి వెళ్లి చైనా బలగాలకు చిక్కిన అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఐదుగురు యువకులను రేపు(శనివారం) చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) మనకు అప్పగించనుందని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఐదుగురు యువకులను తాము ఆధీనంలోకి తీసుకున్నామని, త్వరలోనే తిరిగి భారత్‌కు అప్పగిస్తామని ఇంతకుముందు చైనా ఆర్మీ ప్రకటించింది. ఐదుగురు భారతీయులు సరిహద్దులో అదృశ్యమైన నేపథ్యంలో భారత సైన్యం చైనా ఆర్మీకి హాట్‌లైన్ మెసేజ్ పంపింది. ఈ నేపథ్యంలోనే చైనా స్పందించింది.

5 Civilians Who Went Missing from Arunachal Pradesh to Be Handed over by China Sept 12: Union Minister

శనివారం ఏ సమయంలోనైనా ఐదుగురు భారతీయులను మనకు అప్పగించే అవకాశం ఉందని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఇంతకుముందు వివరాలను గమనించినట్లయితే.. గత శనివారం అప్పర్ సుబాన్సిరి జిల్లాలోని భారత్-చైనా సరిహద్దు అటవీ ప్రాంతంలో వేటకు వెళ్లిన ఐదుగురు అరుణాచల్‌ప్రదేశ్ వాసులను చైనా ఆర్మీ కిడ్నాప్ చేసిందని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలోని నాచో ప్రాంతంలో ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకుందని పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది. మరో ఇద్దరు చైనా ఆర్మీ నుంచి తప్పించుకుని వచ్చి పోలీసులకు ఈ మేరకు సమాచారం ఇచ్చారు.

టోక్ సింగ్కమ్, ప్రసత్ రింగ్లింగ్, డొంగ్తు ఈబియా, తను బెకర్, నరు దరి అనే ఐదురిని చైనా బలగాలు కిడ్నాప్ చేశాయని తెలిపారు. వీరంతా టగిన్ కమ్యూనిటీకి చెందినవారు. జిల్లా కేంద్రం దపోరిజోలో ఉండే బాధితుల కుటుంబసభ్యులు మాట్లాడుతూ.. తమవారి కిడ్నాప్ విషయమై భారత ఆర్మీతో చర్చించేందుకు తమ బంధువులు వెళ్లారని తెలిపారు. నాచో జిల్లా కేంద్రానికి 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

పాసిఘాట్ వెస్ట్ ఎమ్మెల్యే నినంగ్ ఇరింగ్ మాట్లాడుతూ.. ఈ ఘటనకు చైనా ఆర్మీపై ప్రతీకారం తీర్చుకోవాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చైనా బలగాలకు గట్టి బుద్ధి చెప్పాలని ఆయన అన్నారు. గత మార్చి నెలలో 21ఏళ్ల యువకుడ్ని చైనా పీఎల్ఏ కిడ్నాప్ చేసిందని చెప్పారు. 19 రోజుల తర్వాత అతడ్ని విడిచిపెట్టింది చైనా సైన్యం. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని తాము గుర్తించమని, టిబెట్ ప్రాంతంలో భాగంగానే గుర్తిస్తామని డ్రాగన్ దేశం కొత్త వివాదాలకు తెరలేపేందుకు ప్రయత్నిస్తోంది.

English summary
Union Minister Kiren Rijiju said that the Chinese People's Liberation Army (PLA) would hand over the youths, who had gone missing from Arunachal Pradesh, on Saturday at a designated location.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X