మహరాష్ట్రలో రైలు ప్రమాదం: తప్పిన ప్రాణనష్టం
మహారాష్ట్ర :మహారాష్ట్రలోని లోకల్ ఇవాళ తెల్లవారుజామున పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. అయితే ఈ లైన్ ప్రయాణించే రైళ్ళన్నీ ఆలస్యంగా నడుస్తున్నాయి.ట్రాక్ మరమత్తులను యుద్ద ప్రాతిపదికన చేపట్టారు అధికారులు.
కుర్లా అంబర్ నాథ్ రైలు ఇవాళ తెల్లవారుజామున కళ్యాణ్ విఠల్ వాడీ ప్రాంతంలో పట్టాలు తప్పింది. ఈ ఘటనలో రైలుకు చెందిన 5 బోగీలు పట్టాలు తప్పాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు.

పట్టాలు తప్పడంతో కళ్యాణ్. కర్జాత్ మార్గంలో రైళ్ళ రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. ఈ మార్గంలో రైళ్ళ రాకపోకలను నిలిపివేశారు.అయితే ఐదు బోగీలు పట్టాలు తప్పినా ఎటువంటి ప్రమాదం చోటుచేసుకోకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకొన్నారు.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో రైలు ప్రమాదం జరిగిన మరునాడే మహారాష్ట్రలో ఈ రైలు ప్రమాదం చోటుచేసుకొంది. అయితే మహారాష్ట్ర రైలు ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు చెబుతున్నారు.ట్రాక్ మరమ్మత్తు పనులను కొనసాగిస్తున్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!