వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

5 రోజుల ఇన్‌స్టిట్యూషనల్ క్వారంటైన్‌పై వెనక్కి తగ్గిన ఎల్జీ, ఉత్తర్వులు విత్ డ్రా

|
Google Oneindia TeluguNews

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లక్షణాలు ఉన్న వారిని 5 రోజులు గృహ నిర్బంధంలో ఉంచాలని నిన్న లెప్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీతో చర్చించి ఉత్తర్వు కూడా జారీచేశారు. అయితే దీనిపై దుమారం చెలరేగింది. లెప్టినెంట్ గవర్నర్ తీరును అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం తప్పుపట్టింది. దీంతో నిన్న జారీచేసిన ఉత్తర్వును లెప్టినెంట్ గవర్నర్ వెనక్కి తీసుకున్నారు.

ఏపీలో కరోనా విలయం: 491 పాజిటివ్ కేసులు, ఐదుగురి మృతి, 101కి చేరిన సంఖ్య..ఏపీలో కరోనా విలయం: 491 పాజిటివ్ కేసులు, ఐదుగురి మృతి, 101కి చేరిన సంఖ్య..

ఐదురోజుల నిర్బంధంపై అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం బాహాటంగానే విమర్శించింది. ఢిల్లీకే ఎందుకు ప్రత్యేక నిబంధనలు అని లెప్టినెంట్ గవర్నర్‌ను సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు. అంతకుముందు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా కూడా ఎల్జీపై ఫైరయ్యారు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ మార్గదర్శకాలకు విరుద్దమనిమండిపడ్డారు. ఏ లక్షణం లేని వారిని కూడా ఇంటి వద్ద ఉంచడం సరికాదని, దీంతో మరింత గందరగోళం నెలకొంటుందని ఆయన పేర్కొన్నారు.

5-Day Mandatory Institutional Quarantine Order In Delhi Withdrawn..

Recommended Video

#Watch Solar Eclipse 2020 In India మరో గ్రహణం భారత్ నుంచి వీక్షించాలంటే ఒక దశాబ్దం పడుతుందట !

కరోనా వైరస్ లక్షణాలు కనిపించిన వారికి విధిగా ఐదురోజులు ఇన్ స్టిట్యూషనల్ క్వారంటైన్ విధిస్తామని శుక్రవారం ఢిల్లీ ప్రభుత్వం స్పష్టంచేసింది. దీనికి సంబంధించి లెప్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ఉత్తర్వులు కూడా జారీచేశారు. కొత్త రూల్స్ ప్రకారం.. కరోనా వైరస్ సోకిన వ్యక్తి ఐదురోజులు హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందే. సదరు రోగికి వైరస్ లక్షణాలు లేకుంటేనే క్వారంటైన్ కేంద్రం నుంచి బయటకు వచ్చేందుకు అనుమతిస్తారు. కానీ దానిపై ప్రభుత్వం నుంచి వ్యతిరేకత రావడంతో.. ఎల్జీ వెనక్కి తగ్గారు.

English summary
five-day institutional quarantine for anyone testing positive for coronavirus in Delhi, order issued by Lieutenant Governor Anil Baijal, was withdrawn on Saturday
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X