వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

5గురు వాయుసేన పైలట్లకు అవార్డులు...వారికే ఎందుకు...బాలాకోట్‌లో ఏం చేశారు...?

|
Google Oneindia TeluguNews

రెండు దేశాల మధ్య అప్రటిత యుద్దం.. ఏ చిన్న తప్పిదం జరిగిన ప్రాణాలు గాల్లో కలిసే పరిస్థితి.. మరోవైపు ఉద్యోగ కర్తవ్యం..అదనంగా దేశంపై ఉన్న అభిమానం... దీంతో ఎలాంటీ పరిస్థితులైన ఎదుర్కోగలననే మానసిక ధైర్యం.. వెరసి శత్రుమూకలను ధ్వంసం చేయాలనే పట్టుదలతో బయలు దేరిన అయిదుగురు పైలట్లు చివరికి విజయం సాధించారు. 40 మంది సిఆర్‌పిఎఫ్ సైనికుల ప్రాణాలను అన్యాయంగా పొట్టన బెట్టుకున్న పాకిస్థాన్ ఉగ్రవాద శిబిరాలపై బాంబులు వేసి, కేవలం 90 సెకన్లలోనే ఆపరేషన్‌ను పూర్తి చేసి, వెనుగిదిరిగి వచ్చిన పైలట్లను భారత ప్రభుత్వం గుర్తించింది. వారికి వాయుసేన అవార్డులను ప్రకటించింది. భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో వారికి అవార్డులు అందించనున్నారు.

ఫిబ్రవరి 14న ఉగ్రవాదులు దాడి

ఫిబ్రవరి 14న ఉగ్రవాదులు దాడి

ఫిబ్రవరి 14న దేశం మొత్తం నిర్ఘంతపోయో సంఘటన జరిగింది. కశ్మీర్‌లో బధ్రత కోసం వెళుతున్న సీఆర్‌పిఎఫ్ దళాలపై పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడి చేసి 40మందిని పోట్టన పెట్టుకున్న విషయం తెలిసిందే.. దీంతో పాకిస్థాన్ ఉగ్రవాదులకు తగిన శాస్తి చేయాలని భావించిన భారత భద్రతా దళాలు అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాయి. ఎవ్వరు ఊహించని విధంగా ఉగ్రవాద శిబిరాలపై దాడులు నిర్వహించారు.

 48 సంవత్సరాల్లో మొదటి సారి

48 సంవత్సరాల్లో మొదటి సారి

ఇందుకోసం ఆపరేషన్ బందర్‌ అనే మిషన్‌కు రూపకల్పన చేసిన భద్రతా దళాలు, ఫిబ్రవరి 26న బాలాకోట్‌లోని ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్న జైష్ ఏ మహ్మద్ స్థావరంపై ఎయిర్ స్ట్రైక్ నిర్వహించాయి. కాగా దాదాపు 48 సంవత్సరాల తర్వాత పాకిస్థాన్ గగనతలంలోకి వెళ్లి ఎయిర్ స్ట్రైక్ చేసిన సంఘటన ఇది. ఇందుకోసం మిరాజ్ 2000 జెట్ ఫైటర్స్ విమానాలను ఉపయోగించిన విషయం తెలిసిందే...కాగా ఎయిర్ స్ట్రైక్‌లో పాల్గోన్న అయిదుగురు వింగ్ కమాండర్లు బాలాకోట్‌లోని జైష్ ఏ మహ్మద్ ఉగ్రవాద స్థావరంపై బాంబులు వేసి, మిషన్‌ బందర్‌ను కేవలం 90 సెకన్లలో పూర్తి చేసి శిబిరాన్ని నేలమట్టం చేశారు. దీంతో సుమారు 250 పైగా ఉగ్రవాదులు మృత్యువాత పడ్డారనే వార్తలు వెలువడ్డాయి.

మొదటిసారి ఐఏఎఫ్ పైలట్లకు అవార్డులు

మొదటిసారి ఐఏఎఫ్ పైలట్లకు అవార్డులు

ఈ నేపథ్యంలోనే బాలాకోట్‌లో ఉగ్రవాద శిబిరాలను బాంబులు వేసి నాశనం చేసిన వింగ్ కమాండర్ అమిత్ రంజన్ తోపాటు ఇతర స్కాడ్రాన్ లీడర్స్ అయిన రాహుల్ బసోయా,పంకజ్ బుజాడే,శశాంక్ సింగ్,బికెఎన్ రెడ్డిలు పాల్గోనడంతో పైలట్ల ధైర్యసహసాలకు గాను వాయుసేస అవార్దులను ప్రకటించింది. వీటిని గురవారం జరగబోయో స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల్లో అందించనున్నారు. కాగా ఇజ్రాయిల్‌కు చెందిన మిరాజ్ 2000 జెట్ ఫైటర్‌తో బాంబులను వేసి లక్ష్యాలను చేధించిన పైలట్లను భారత వైమానిక దళం గుర్తించడం ఇదే మొదటిసారి.

English summary
The five Mirage-2000 fighter pilots of the Indian Air Force who dropped bombs on the terror facility of the Jaish-e-Mohammed terror camp in Pakistan are being named for the Vayu Sena Medal for gallantry to be announced on the eve of Independence Day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X