వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

delhi clashes time line: ఈశాన్య ఢిల్లీ రావణకాష్టంగా మారడానికి కారణమిదేనా...?

|
Google Oneindia TeluguNews

పౌరసత్వ సవరణ చట్టం అనుకూలంగా, ప్రతికూలంగా నిరసనకారులు చేసిన ఆందోళనలు దేశ రాజధానిలోని జాఫ్రాబాద్, మౌజ్‌పూర్‌ రావణాకాష్టంగా మార్చింది. హింసాత్మక ఘటనతో భద్రతా సిబ్బంది రంగంలోకి దిగినా.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఒక హెడ్ కానిస్టేబుల్ సహా ఐదుగురు చనిపోయారు. మరో 50 మంది వరకు గాయపడ్డారు.

Recommended Video

3 Minutes 10 Headlines | #MeToo | Namaste Trump | Anti CAA Row | Oneindia Telugu

కారణమిదేనా..?
ఇంతకీ ఈశాన్య ఢిల్లీలో హింస ఎలా చెలరేగింది. అదీ సోమవారం నాటికి హింసాత్మకంగా ఎలా మారింది. ఇళ్లను దహనం చేసి, షాపులు, వాహనాలను ధ్వంసం చేసి, పెట్రోల్ పంపులపై దాడి చేసే వరకు ఎలా వెళ్లింది. ఆందోళనకారులు రాళ్లతో ఎందుకు రెచ్చిపోయారు. పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించిన పరిస్థితి ఎందుకు అదుపులోకి రాలేదు. జాఫ్రాబాద్, మౌజ్‌పూర్‌తోపాటు చాంద్‌బాగ్, ఖురేజీ ఖాస్, భాజన్‌పుర వద్ద పరిస్థితి ఎందుకు చేయిదాటిపోయింది. భద్రతా దళాలు ప్లాగ్ మార్చ్ నిర్వహించే వరకు కారణమెంటీ అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సోమవారం సాయంత్రం వరకు పరిస్థితి అదుపులోకి వచ్చినట్టు అనిపించినా.. తర్వాత మళ్లీ చేయిదాటి పోయింది. ఇంతకీ ఈశాన్య ఢిల్లీలో ఆందోళనకు గల కారణం ఏంటీ..? టైమ్ లైన్ చుద్దాం పదండి.

5 killed in clashes, How violence unfolded in northeast Delhi..

ఫిబ్రవరి 22 సమయం రాత్రి 10.30 గంటలు: శనివారం రోజున భీం ఆర్మీ దేశవ్యాప్త బంద్‌నకు పిలుపునిచ్చింది. దీంతో ఆందోళనకారులు చాంద్‌బాగ్ నుంచి రాజ్‌ఘాట్ వెళ్లేందుకు ప్రయత్నించారు. జాఫ్రాబాద్ మెట్రో స్టేషన్ సమీపంలో గల రోడ్డుపై కొందరు ఆందోళనకారులు సహా మహిళ నిరసనకు దిగారు. దీంతో ఈశాన్య ఢిల్లీలో ఆందోళన ప్రారంభమైనట్టు భావించొచ్చు.

ఫిబ్రవరి 23 సమయం 9 గంటలు: శనివారం రాత్రి నుంచి ఆందోళన కొనసాగింది. దీంతో పోలీసులు ఘటనాస్థలానికి వచ్చి ఇక్కడినుంచి వెళ్లిపోవాలని సూచించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోందని చెప్పారు. రాజ్‌ఘాట్ వరకు ర్యాలీ తీసేందుకు అనుమతి లేదని స్పష్టంచేశారు.

ఫిబ్రవరి 23 సమయం మధ్యాహ్నం 12 గంటలు: సీఏఏకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తోన్న వారిని బీజేపీ నేత కపిల్ మిశ్రా రెచ్చగొట్టారు. మధ్యాహ్నం 3 గంటల వరకు మౌజ్‌పూర్ చౌక్ వద్దకు భారీగా చేరుకోవాలని తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు. సీఏఏకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తోన్న వారికి సమాధానం ఇవ్వాలని సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

5 killed in clashes, How violence unfolded in northeast Delhi..

ఫిబ్రవరి 23 సమయం 3.30 నుంచి 4 గంటల మధ్య: పరిస్థితి దృష్ట్యా జాఫ్రావాద్ వెళ్లొద్దని బీజేపీ శ్రేణులకు ఢిల్లీ పోలీసులు స్పష్టంచేశారు. దీంతో కపిల్ మిశ్రా రెచ్చిపోయారు. శ్రేణులను రెచ్చగొట్టే ప్రసంగం చేసి.. ఆందోళనలకు దారితీసే పరిస్థితి కల్పించారు.

ఫిబ్రవరి 23 సమయం 3.45 నుంచి 4 గంటల మధ్య: మౌజ్‌పూర్ చౌక్ వద్ద గల ఆలయ సమీపంలో ఉన్న సీఏఏ అనుకూల వర్గంపై బాబర్‌పూర్‌కి చెందిన యాంటీ సీఏఏ నిరసనకారులు రాళ్లురువ్వడంతో గొడవ ప్రారంభమైంది.

ఫిబ్రవరి 23 సమయం 4 నుంచి 5 గంటలు: రాళ్లురువ్వడంతో గొడవ ప్రారంభమైంది. మౌజ్‌పూర్, కారవల్ నగర్, మౌజ్‌పూర్ చౌక్, బాబర్ పూర్, చాంద్‌బాగ్‌లో ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నారు. పోలీసులు రంగంలోకి దిగి లాఠీచార్జీ చేశారు. తర్వాత టియర్ గ్యాస్ ప్రయోగించారు. వెంటనే రంగంలోకి పారామిలిటరీ బలగాలు దిగాయి.

ఫిబ్రవరి 23 రాత్రి 7 నుంచి 8.30 గంటలు: సాయంత్రం నుంచి రాత్రి 9 గంటల వరకు పరిస్థితి అదుపులోనే ఉంది.

ఫిబ్రవరి 23 రాత్రి 9 నుంచి 11 గంటలు: ఇరువర్గాలు కారవల్ నగర్, చాంద్ బాగ్, బాబర్ పూర్, మౌజ్‌పూర్‌లో మళ్లీ గొడవ పడ్డారు. కార్లు, వాహనాలను నిలిపివేసి.. షాపులను ధ్వంసం చేశారు.

ఫిబ్రవరి 24: సోమవారం జాఫ్రాబాద్‌లో ఆందోళనలు కొనసాగాయి.

ఫిబ్రవరి 24 ఉదయం 10 గంటలు: సీఏఏ వ్యతిరేక ఆందోళనకారుల వద్దకు అనుకూల నిరసనకారులు వచ్చి నినాదాలు చేశారు. అక్కడే ఉండి రెచ్చగొట్టారు. వెళ్లిపోవడానికి నిరాకరించడంతో.. గొడవ జరిగేందుకు కారణమైంది.

ఫిబ్రవరి 24 మధ్యాహ్నం 12 నుంచి 1.30 గంటలు: బాబర్ పూర్ రాళ్లతో మాస్క్ వేసుకొన్న కొందరు ఆందోళనకారులు రాళ్లతో దాడి చేశారు. పోలీసులపై కూడా కత్తులతో విరుచుకుపడ్డారు. దీంతో పారామిలిటరీ దళాలు కూడా రంగంలోకి దిగాయి. తర్వాత కారవల్ నగర్, షేర్‌పూర్ చౌక్, గోకుల్‌పురీ వద్ద ఆందోళనలు జరగడంతో పోలీసులు లాఠీచార్జీ చేశారు. తర్వాత టియర్ గ్యాస్ ప్రయోగించారు.

ఫిబ్రవరి 24 మధ్యాహ్నం 12.30 నుంచి 1 గంట మధ్య: కర్దామ్‌పురి వద్ద రెచ్చిపోయిన ఆందోళనకారులు, రాళ్లతో విరుచుకుపడటంతో ఉద్రిక్తత

ఫిబ్రవరి 24 మధ్యాహ్నం 2.30 నుంచి 3.30 గంటలు: మరింత రెచ్చిపోయిను ఆందోళనకారులు. బస్సులు, వాహనాలకు నిప్పుపెట్టి రెచ్చిపోయారు. వాహనాలను ధ్వంసం చేసి, పెట్రోల్ బంక్‌కు కూడా నిప్పుపెట్టిన వైనం. తీవ్రగాయాలతో హెడ్ కానిస్టేబుల్ మ‌ృతిచెందగా, డీసీపీ గాయపడ్డారు.

ఫిబ్రవరి 24 మధ్యాహ్నం 3.50 నుంచి సాయంత్రం 6 వరకు: కర్దామ్‌పురిలో మళ్లీ ఘర్షణలు

ఫిబ్రవరి 24 సమయం రాత్రి 7.30 నుంచి 8 గంటల వరకు: గోకుల్‌పురిలో గల టైర్ మార్కెట్‌లో నిప్పుపెట్టిన వైనం, మంటలు సమీపంలోని స్కూల్‌కి వ్యాపించి ధ్వంసమైంది.

ఫిబ్రవరి 24 రాత్రి 10 గంటలు: ఘొండా చౌక్, మౌజ్‌పూర్ చౌక్ వద్ద అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి.

English summary
five people, including a head constable, were killed and at least 50 others injured as violence spiralled over the amended citizenship law in northeast Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X