వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బోధగయ పేలుళ్ల కేసు: ఐదుగురు దోషులకు జీవిత ఖైదు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/బీహార్: 2013లో బోధగయలో వరుస పేలుళ్లకు పాల్పడిన కేసులో ఐదుగురు దోషులకు జీవిత ఖైదు విధిస్తూ ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం తీర్పు వెలువరించింది. జీవిత ఖైదు తోపాటు రూ.10వేల జరిమానా కూడా విధించింది.

2013, జులై7న బోధగయలో వరుస పేలుళ్లకు పాల్పడ్డ నిందితులు హైదర్ అలీ అలియా బ్లాక్ బ్యూటీ, ఇంతియాజ్ అన్సారీ, ఉమర్ సిద్ధిఖీ, అజహరుద్దీన్ ఖురేషీ, ముజిబుల్లా అన్సారీలను గత శుక్రవారం దోషులుగా తేలుస్తూ తీర్పు ఇచ్చారు న్యాయమూర్తి మనోజ్ కుమార్.

5 sentenced to life in Bodh Gaya serial blast case

బోధగయలో ఈ దోషులు జరిపిన వరుస 9పేలుళ్లలో ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇద్దరు బౌద్ధ సన్యాసులు ఉన్నారు. కాగా, బోధి వృక్షం కింద అమర్చిన సిలిండర్ బాంబు పేలకపోవడంతో భారీ ప్రాణనష్టం తప్పింది. ఈ పేలుళ్ల వెనుక సిమి ఉగ్రవాద సంస్థ హస్తముందని ఎన్ఐఏ తేల్చింది.

English summary
A special National Investigation Agency (NIA) court sentenced all convicts in the Bodh Gaya serial bomb blast case to life imprisonment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X