వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్‌కౌంటర్: 5గురు జవాన్లకు గాయాలు, ముగ్గురి పరిస్థితి విషమం

|
Google Oneindia TeluguNews

సుకుమా: ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లాలో శనివారంనాడు భద్రతా దళాలకూ, మావోయిస్టులకూ మధ్య భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఇక్కడి చింతగుఫాలో మావోయిస్టులు- పారామిలిటరీ దళాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు జవాన్లు గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఇరు వర్గాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. చింతగుఫ పోలీస్ స్టేషన్ పరిధిలోని దట్టమైన అడవుల్లో భద్రతా దళాల సంయుక్త బృందం, మావోయిస్టుల మధ్య కాల్పుల ఘటన చోటుచేసుకున్నట్టు దంతేవాడ రీజియన్ డీఐజీ సుందరాజ్ తెలిపారు.

5 STF jawans injured, 3 critical in Sukma Maoists attack

ప్రాథమిక సమాచారం ప్రకారం ఐదుగురు జవాన్లు ఈ ఎన్‌కౌంటర్‌లో గాయపడ్డారని చెప్పారు. ఎస్‌టీఎఫ్, జిల్లా రెవెన్యూ గార్డులు, కమెండో బెటాలియన్ ఫర్ రిజల్యూషన్ యాక్షన్ (కోబ్రా) దళాలు సంయుక్తంగా నక్సల్స్ ఏరివేత ఆపరేషన్‌లో పాల్గొన్నట్టు తెలిపారు.

English summary
Five Special Task Force jawans were injured on Saturday in an attack by Maoists in Chintagufa area of Sukma district in Chhattisgarh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X