వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మత్తు మందిచ్చి యువతిపై గ్యాంగ్ రేప్.. ఐదుగురు నిందితుల అరెస్ట్..

|
Google Oneindia TeluguNews

బెంగళూరు : కామాంధులు రెచ్చిపోతున్నారు. కండకావరంతో అత్యాచారాలకు తెగబడుతున్నారు. తాజాగా స్నేహితుడని నమ్మిన పాపానికి ఓ యువతి జీవితం నాశనం చేశాడో ప్రబుద్ధుడు. తనతో పాటు మరో నలుగురితో కలిసి సదరు యువతిపై గ్యాంగ్ రేప్ చేశాడు. కర్నాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుమోటోగా కేసు నమోదుచేసుకున్న పోలీసులు ఐదుగురు నిందితుల్ని అరెస్ట్ చేశారు.

తన భార్యను రేప్ చేసి చంపేశారని పోలీసులకు ఫోన్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..తన భార్యను రేప్ చేసి చంపేశారని పోలీసులకు ఫోన్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

మత్తు మందిచ్చి అత్యాచారం

మత్తు మందిచ్చి అత్యాచారం

దక్షిణ కన్నడ జిల్లాలోని పుత్తూరుకు చెందిన ఓ యువతి ఇంజనీరింగ్ చదువుతోంది. అదే కాలేజీలో చదివే ఓ యువకుడు బాధిత యువతిపై కన్నేశాడు. ఆమెతో పరిచయం పెంచుకుని స్నేహంగా ఉన్నట్లు నటించాడు. గత మార్చిలో బయటకు వెళ్దామని నిందితుడు కోరడంతో బాధితురాలు సరేనంది. యువతి స్నేహితుడితో పాటు మరో నలుగురు యువకులు ఆమెతో కలిసి కారులో బయలుదేరాలు. కారును అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లిన నిందితులు యువతికి మత్తు మందిచ్చి గ్యాంగ్ రేప్ చేశారు. ఈ మొత్తం వ్యవహారాన్ని మొబైల్‌లో షూట్ చేసిన దుర్మార్గులు విషయం ఎవరికైనా చెబితే వీడియో బయటపెడతామని బెదిరించారు. దీంతో బాధితురాలు దుఖాన్ని దిగమింగుకుని మిన్నకుండిపోయింది.

సుమోటోగా స్వీకరించిన పోలీసులు

సుమోటోగా స్వీకరించిన పోలీసులు

ఇదిలా ఉంటే అత్యాచారాన్ని వీడియో తీసిన నిందితుడు అందులో చిన్న బిట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అది వైరల్‌గా మారడంతో పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో మంగుళూరు జిల్లా పోలీసులు సుమోటో కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలిని కలిసి విషయం తెలుసుకున్నారు. నిందితుల్లో ఒకరు తనకు తెలుసని, అతను తన స్నేహితులతో కలిసి దారుణానికి పాల్పడ్డాడని చెప్పింది.

ఐదుగురు నిందితుల అరెస్ట్

ఐదుగురు నిందితుల అరెస్ట్

బాధిత యువతి నుంచి సేకరించిన వివరాల మేరకు పుత్తూరు తాలూకా బజత్తూరు గ్రామానికి చెందిన గురునందన్ అలియాస్ రాధాకృష్ణ, సునీల్ కుమార్, కాంతప్పగౌడ, ప్రజ్వల్, అలియాస్ నగేశ్ నాయక్, కిషన్ అలియాస్ సదాశివ, బల్య ప్రఖ్యాత్ అలియాస్ సుబ్బన్న శెట్టిలను అరెస్ట్ చేశారు. వారిపై ఐపీసీ సెక్షన్ 354 (సీ), ఐటీ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. వాట్సప్‌లో వీడియో షేర్ చేసిన గ్రూప్ అడ్మిన్‌లపైనా చర్యలు తీసుకోనున్నట్లు ఎస్పీ ప్రకటించారు. వీడియోలను ఎవరూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దని వార్నింగ్ ఇచ్చారు.

English summary
Five students of Dakshina Kannada district were arrested on charges of raping a girl in March this year, the police said. The incident came to light this week after a number of video clips of the incident were widely shared on social media and instant messaging applications.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X