• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కొత్త ఇంటికి ఇషా అంబానీ ఆనంద్ పిరమల్ జంట: ఇంటి విశేషాలు చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది

|

ఈ ఏడాది భారత దేశం కొన్ని ఘనమైన వేడుకలకు వేదికైంది. అందులో ఒకటి ప్రపంచ ధనవంతుల్లో ఒకరైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కూతురు ఇషా అంబానీ వివాహం. ఈ వివాహానికి అయిన ఖర్చు అక్షరాల రూ.700 కోట్లు. ఇక పెళ్లికి కొద్ది రోజుల ముందు నుంచే హడావుడి స్టార్ట్ అయ్యింది. దేశ విదేశాల నుంచి వచ్చిన అతిథులు తమ కొత్త జంటకు తమ ఆశీర్వాదాలు అందించారు. ఈ పెళ్లిలో ప్రముఖ పాప్ సింగర్ బియాన్స్ తన ప్రదర్శన ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా పెళ్లయిన జంటకు స్వాగతం పలికేందుకు ముంబై‌లో బీచ్‌కు ఎదురుగా ఉన్న బంగ్లా అత్యంత సుందరంగా ముస్తాబైంది. ఇంతకీ ఈ బంగ్లా ప్రత్యేకత ఏమిటి... దీని వెల ఎంత తెలుసుకుందాం.

 కొత్త ఇంట్లో కొత్త కాపురం పెట్టనున్న ఇషా-ఆనంద్ పిరమల్

కొత్త ఇంట్లో కొత్త కాపురం పెట్టనున్న ఇషా-ఆనంద్ పిరమల్

ఇషా అంబానీ... భారతదేశంలో అత్యంత సంపన్నుడుగా పేరుగాంచిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ గారాల పట్టి. ఒక్కగాను ఒక్క కూతురుని ఈ అపరకుబేరుడు కాలికి మట్టి అంటకుండా పెంచారు. ఆడపిల్ల ఎప్పటికైనా మెట్టినింటికి వెళ్లాల్సిందే కాబట్టి... తన కూతురు కోరుకున్న వాడితోనే వివాహం చేశాడు. పిరమల్ అధినేత కుమారుడు ఆనంద్ పిరమల్‌తో ఇషా అంబానీ వివాహం జరిగిందది. అది కూడా ఆషా మాషీగా కాదు.... ఈ వివాహం కచ్చితంగా చరిత్రలో నిలిచిపోతుంది. దేశ విదేశాల నుంచి అతిరథ మహారథుల కోసం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి మరీ వారంతా ముంబైలో వాలేలా ఏర్పాటు చేశారు. పెళ్లి ఘనంగా జరిగింది. ఇక కొత్త జంట కొత్త ఇంట్లోకి అడుగుపెట్టాల్సిన సమయం వచ్చేసింది. ఇందుకోసం వరుడు ఆనంద్ పిరమల్ తల్లిదండ్రులు ముంబైలో సముద్రం తీరాన ఓ అద్భుతమైన బంగ్లా బహుమతిగా ఇచ్చారు. ఈ బంగ్లా విలువ అక్షరాల రూ.445 కోట్లు.

50వేల చదరపు అడుగుల స్థలంలో భవనం

50వేల చదరపు అడుగుల స్థలంలో భవనం

50వేల చదరపు అడుగుల స్థలమున్న ఈ బంగ్లా ముంబైలోని అత్యంత ఖరీదు ప్రాంతమైన ఓర్లీలో ఉంది. బంగ్లాకు ఎదురుగా అరేబియా సముద్రం పలకరిస్తుంది. అయితే ఇప్పటి వరకు ముఖేష్ అంబానీ ఇల్లు యాంటిలాలో యువరాణిలా కాలం గడిపిన ఇషా అంబానీ ఇప్పుడు ఈ ఇంటికంటే సైజులో ఎనిమిది రెట్లు చిన్నగా ఉన్న ఇంటిలోకి అడుగుపెట్టబోతోంది. ఇక ముఖేష్ అంబానీ ఇళ్లు యాంటిలాలోనే ఇషా అంబానీ వివాహం జరిగింది. యాంటిలా 27 అంతస్తుల బంగ్లా. ఇది 4లక్షల చదరుపు అడుగుల స్థలంలో నిర్మించబడింది. యాంటిలా గృహం ముంబైకే తలమానికంగా నిలిచింది.

గులిటా భవంతిని కానుకగా ఇచ్చిన ఆనంద్ తల్లిదండ్రులు

గులిటా భవంతిని కానుకగా ఇచ్చిన ఆనంద్ తల్లిదండ్రులు

ఇక పెళ్లి అనంతరం ఈ కొత్త జంటా గులిటా అనే ఈ భవనంలో కొత్త కాపురం పెట్టనున్నారు. గులిటా భవనాన్ని ఆనంద్ తల్లిదండ్రులు కానుకగా ఇచ్చారు. ఈ బంగ్లాకు ఓ చరిత్ర ఉంది. రియల్ ఎస్టేట్, ఫార్మా రంగాల్లో ఎక్కువగా ఆసక్తి చూపే పిరమల్ కుటుంబం ఈ బంగ్లాను హిందుస్తాన్ యూనిలివర్ సంస్థ నుంచి కొనుగోలు చేసింది. 2012లో కొనుగోలు చేసిన ఈ బంగ్లా విలువ రూ.445 కోట్లు. ఇళ్లు మొత్తం అద్దాలతో డిజైన్ చేశారు. వివాహం జరుగుతుంది అనగా కొన్ని నెలల ముందు నుంచి ఇంటి మరమత్తు పనులు చేపట్టారు. ఈ ఇంటి మరమత్తు పనులను లండన్‌లోని ప్రముఖ ఆర్కిటెక్చర్ కంపెనీకి అప్పగించారు. మొత్తం 3డీ టెక్నాలజీ వినియోగించి రెనోవేట్ చేశారు. ఇషా-ఆనంద్‌ల జంట ఉండబోయే గులిటా భవనంకు మూడు బేస్మెంట్లు ఉన్నాయి. ఇందులో పదుల సంఖ్యలో డైనింగ్ రూమ్‌లు ఉన్నాయి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
As the celebrations from what many are calling the wedding of the year wind down, all eyes are now turning to the multi-million dollar mansion that Isha Ambani, the daughter of India's richest man Mukesh Ambani, will move into with husband Anand Piramal.The 50,000 square-foot mansion, which stands in the swanky locality of Worli in South Mumbai and has sweeping views of the Arabian Sea and the Sea-Link bridge is still a step down for the bride, given her father's home Antilia is more than eight times that size.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more