వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెండు సంవత్సరాల్లో 50 లక్షల ఉద్యోగాలు మటు మాయం : అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్శీటి నివేదిక

|
Google Oneindia TeluguNews

భారత దేశం ఓవైపు ఉద్యోగాల కల్పనలో అనేక చర్యలు తీసుకుంటుందని చెబుతున్న నేపథ్యంలో మరోవైపు ఉన్న ఉద్యోగాలకే దిక్కులేని పరిస్థితి కనిపించిందని నివేదికలు చెబుతున్నాయి. దేశంలో గత రెండెళ్లుగా 50 లక్షల ఫురుషుల ఉద్యోగాలు పోయాయని స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా పేరుతో అజీమ్ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం ఓ నివేదిక విడుద చేసింది. ఇందులో ఉద్యోగాలు పోవడానకి కారణాలను నిపుణులు విశ్లేషించారు.

ముఖ్యంగా నివేదికలో 2016 -18 మధ్య కాలంలో కేవలం పురుషులకు చెందిన ఉద్యోగాలే 50 లక్షల వరకు పోగట్టుకున్నట్టు నివేదికలో పేర్కోన్నారు. అయితే ఈసమయంలో నోట్ల రద్దు కార్యక్రమం వెలువడిందని అయితే ఇవి రెండు కూడ యాదృఛ్చికంగా జరిగాయని పేర్కోన్నారు. నోట్ల రద్దు ద్వార ఉద్యోకాలు ప్రత్యక్షంగా కోల్పోకపోయినా, ఉద్యోగాలు కోల్పోవడానికి మాత్రం నోట్ల రద్దుతోపాటు జీఎస్టీ ప్రవేశపెట్టడం కూడ కారణాలని పేర్కోంది. కాగా ఉద్యోగాలు పోగోట్టుకున్న వారిలో ఎక్కువగా డిగ్రి లేదా డిప్లోమా స్థాయికంటే తక్కువ విద్యార్హతలు ఉన్నవారిపై ఎక్కువ ప్రభావం పడిందని తెలిపారు.

50 lakh Indian men lost their jobs in last two years

కాగా యువకుల్లో ఇది ఎక్కువగా కనిపించిందని ఇది పట్టణ మరియు గ్రామీణ ప్రాంత యువకులు కూడ ఉద్యోగాలు కోల్పోయారని తెలిపారు. గడిచిన రెండెళ్లలో ఉద్యోగాలు కోల్పోతూ రావడంతో నిరుద్యోగిత పెరిగిందని చెప్పారు.కాగా ప్రస్థుతం ఉన్నత చదువులు ఉన్నవారికి ఉద్యోగాలు కల్పించాలనే చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో తక్కువ స్థాయి విద్య ఉన్నవారికి కూడ ఉద్యోగాల కల్పనపై కూడ ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని నివేదిక సమర్పించిన నిపుణులు సూచించారు.కాగా 50 లక్షలు ఉద్యోగాలు కేవలం పురుషులకు సంబంధించినవే కాగా మహిళల ఉద్యోగాలు పరిగణలోకి తీసుకుంటే ఆ సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నట్టు కూడ వారు నివేదికలో పేర్కోన్నారు.

English summary
At least 50 lakh Indian men lost their jobs between 2016 and 2018, reveals a report prepared by the Azim Premji University. The report titled 'State of Working India' has been prepared by the university's Centre for Sustainable Employment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X