వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

coronavirus: బీర్ అనుకొని యాసిడ్ తాగి, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి...

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్‌తో దేశవ్యాప్తంగా రెండో విడత లాక్‌డౌన్ పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ నెల 20వ తేదీ వరకు ఆంక్షలు కఠినంగా అమలు చేస్తారు. అయితే తర్వాత నిబంధనలను సడలిస్తారు. 20వ తేదీ వరకు మధ్యప్రదేశ్‌లో లిక్కర్ షాపులు మూసి ఉంటాయి. ముందు దొరకడం లేదో అనో ఏమో గానీ.. ఓ వృద్దుడు బీర్ అనుకొని యాసిడ్ తాగాడు. పరిస్థితి విషమించి చనిపోయాడు.

భోపాల్‌లోని టీటీ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో సురేష్ సజాల్కర్ అనే వ్యక్తి ఉంటున్నాడు. అయితే సోమవారం రోజున ఆయనకు బీర్ బాటిల్ కనిపించింది. అయితే అందులో బీర్ బదులు.. యాసిడ్ ఉంది. అది గమనించిన సురేశ్.. బీర్ అనుకొని తాగాడు. నోట్లో పడ్డాక గానీ తెలియలేదు. అది యాసిడ్ అని.. తర్వాత అరుపులు పెడబొబ్బులతో ఇరుగు పొరుగువారికి తెలిసింది. వెంటనే అతనిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

50-year-old dies after accidentally drinking acid stored in beer bottle

కానీ ఫలితం లేకపోయింది. ఆయన బుధవారం చనిపోయాడని పోలీసులు పేర్కొన్నారు. మందు అనుకొని.. యాసిడ్ తాగడం కలకలం రేపగా... అతను చనిపోవడం ఆ ఇంట్లో విషాదం నింపింది. మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించగా.. అప్పటివరకు షాపింగ్ మాల్స్ క్లోజ్ చేస్తామని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టంచేశారు.అయితే ఏప్రిల్ 20 తర్వాత మాత్రం వైన్ షాపులు తెరుస్తామని తేల్చిచెప్పారు. లాక్ డౌన్ ప్రకటించినప్పటీ నుంచి రాష్ట్రంలో వైన్ షాపులను మూసివేసిన సంగతి తెలిసిందే.

English summary
Suresh Sajalkar, a resident of Chakki crossing, guzzled the acid mistaking it for beer, His condition soon deteriorated and he was rushed to a hospital, where he died on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X