వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పూజారి సజీవ దహనం .. దేవుడి మాన్యాల వివాదంలో ల్యాండ్ మాఫియా ఘాతుకం

|
Google Oneindia TeluguNews

రాజస్థాన్ రాష్ట్రంలో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. రాజస్థాన్ లో ఒక ఆలయ పూజారి పై పెట్రోల్ పోసి నిప్పంటించి సజీవ దహనానికి ప్రయత్నించారు కొందరు ల్యాండ్ మాఫియా. భూవివాదంలో పూజారి వంటి పై పెట్రోల్ పోసి నిప్పంటించటంతో తీవ్ర గాయాలపాలైన 50ఏళ్ల పూజారి ప్రాణాలు కోల్పోయారు.

రాజస్థాన్‌లోనూ అదే దారుణం: ఇద్దరు మైనర్ బాలికలపై గ్యాంగ్ రేప్..మూడు రోజుల పాటు..!రాజస్థాన్‌లోనూ అదే దారుణం: ఇద్దరు మైనర్ బాలికలపై గ్యాంగ్ రేప్..మూడు రోజుల పాటు..!

భూవివాదంలో పూజారి పై పెట్రోల్ పోసి తగలబెట్టిన ల్యాండ్ మాఫియా

భూవివాదంలో పూజారి పై పెట్రోల్ పోసి తగలబెట్టిన ల్యాండ్ మాఫియా

రాజస్థాన్ రాజధాని జైపూర్ కు 170 కిలో మీటర్ల దూరంలో కరౌలీ జిల్లాలోని ఒక గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాధాకృష్ణ ఆలయానికి సంబంధించిన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించిన ల్యాండ్ మాఫియా ప్రయత్నాన్ని ప్రతిఘటించడంతో 50 ఏళ్ల పూజారిపై ఆరుగురు కిరోసిన్, పెట్రోలు పోసి నిప్పంటించారు. కరౌలి జిల్లాలోని ఓ గ్రామంలో రాధాకృష్ణ ఆలయానికి చెందిన భూమి విషయంలో తలెత్తిన వివాదం చిలికి చిలికి గాలివానగా మారి చివరికి పూజారి ప్రాణాలు తీసే వరకు వెళ్ళింది.

 కరౌలీ జిల్లాలో దేవుడి మాన్యాల వివాదం .. చిలికి చిలికి గాలివానగా

కరౌలీ జిల్లాలో దేవుడి మాన్యాల వివాదం .. చిలికి చిలికి గాలివానగా

కరౌలీ జిల్లాలో దేవుడి మాన్యాలు కు సంబంధించి వివాదం నెలకొంది. గ్రామానికి చెందిన పూజారి బాబూలాల్ వైష్ణవ్ దేవుడు మాన్యం కింద తనకు బహుమతిగా ఇచ్చిన భూమిలో వ్యవసాయం చేయాలని అనుకున్నాడు.అయితే మీనా కమ్యూనిటీకి చెందిన కొందరు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసి, ఆ భూమి తమదేనని అక్కడికి వెళ్ళిన పూజారి తో గొడవకు దిగారు. భూమి విషయంలో గ్రామ పెద్దలు పంచాయతీ పెట్టి, పూజారికి అనుకూలంగా తీర్పు కూడా ఇచ్చారు. దీంతో భూమి హక్కులు పూజారికే ఉన్నట్టు తేలింది .

పంటను , పూజారిని పెట్రోల్ పోసి తగలబెట్టిన నిందితులు .. పూజారి మృతి .. కేసు నమోదు

పంటను , పూజారిని పెట్రోల్ పోసి తగలబెట్టిన నిందితులు .. పూజారి మృతి .. కేసు నమోదు

సదరు భూమిలో వ్యవసాయం చేశాడు పూజారి బాబూలాల్ వైష్ణవ్. అయితే అదే భూమిలో మీనా కమ్యూనిటీకి చెందిన వారు గుడిసె వేసి, మళ్లీ పూజారితో గొడవకు దిగారు. ప్రశ్నించిన పూజారి పంటను పెట్రోల్ పోసి తగలబెట్టటమే కాకుండా పూజారి పై కూడా పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఇక ఈ విషయాన్ని బాధితుడు తన మరణ వాంగ్మూలం లో తెలియజేశాడు. కైలాష్ ,శంకర్ ,నమో మీనా సహా మరో ఆరుగురి పేర్లను పూజారి తన మరణ వాంగ్మూలం లో వెల్లడించారు.తీవ్ర గాయాల పాలైన పూజారి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు ప్రధాన నిందితుడు కైలాష్ మీనాను అదుపులోకి తీసుకున్నారు.

English summary
In a shocking incident a temple priest was set on fire in Rajasthan's Karauli. The 50-year old priest was set on fire with kerosene and petrol by six people after he resisted an attempt by the land mafia to encroach upon land that belonged to the temple authorities. He later succumbed to injuries and died. According to reports, part of the land was gifted to him by the temple authorities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X