వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంతర్జాతీయ యోగా దినోత్సవం: ఢిల్లీ రికార్డు బద్దలు, మైసూరు వేదిక, గిన్నీస్ రికార్డు దిశగా !

ప్రతి రోజూ యోగా చేస్తే ఆరోగ్యంగా ఉంటారు. యోగా చేసిన వారికి, యోగా చెయ్యని వారి ఆరోగ్యంలో ఎంతో వ్యత్యాసం ఉంటుంది. యోగాకు భారతదేశంలోని ప్రజలు ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. ప్రతి రోజు ఒక గంట సేపు యోగా చేస్తే ఎ

|
Google Oneindia TeluguNews

మైసూరు/బెంగళూరు: ప్రతి రోజూ యోగా చేస్తే ఆరోగ్యంగా ఉంటారు. యోగా చేసిన వారికి, యోగా చెయ్యని వారి ఆరోగ్యంలో ఎంతో వ్యత్యాసం ఉంటుంది. యోగాకు భారతదేశంలోని ప్రజలు ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. ప్రతి రోజు ఒక గంట సేపు యోగా చేస్తే ఎంతో హాయిగా, ఉల్లాసంగా ఉంటుంది.

అంతర్జాతీయ యోగా దినోత్సవం (జూన్ 21) సందర్బంగా ప్రంపచ రికార్డు సృష్టించడానికి కర్ణాటకలోని మైసూరు నగరం వేదిక అయ్యింది. 2015లో ఢిల్లీలోని రాజ్ పథ్ లో 35,985 మందితో ఒకే సారి యోగా చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు, ఇప్పుడు ఆ రికార్డు బద్దలు కొట్టడానికి మైసూరు నగరం వేదిక అయ్యింది.

సరికొత్త ప్రయోగం

సరికొత్త ప్రయోగం

మైసూరు జిల్లా కలెక్టర్ అంతర్జాతీయ యోగా దినోత్సవం గ్రాండ్ గా చెయ్యాలని నిర్ణయించారు. అందుకోసం ఓ సరికొత్త ప్రయోగం చెయ్యాలని నిర్ణయించారు. మైసూరు నగరంతో పాటు ఆ జిల్లా మొత్తం అంతర్జాతీయ యోగా దినోత్సవంలో మీరు పాల్గొనండి అంటూ ప్రచారం చేశారు.

50 వేల మంది టార్గెట్

50 వేల మంది టార్గెట్

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గోనడానికి ఆసక్తి ఉన్న ప్రజలు తమ పేర్లు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. 50 వేల మందితో ఒకే చోట యోగా చేసి ప్రపంచ రికార్డు సృష్టించాలని ప్లాన్ వేశారు. అందుకు తగట్లు మీడియా సహాయంతో ప్రచారం చేశారు.

ఊహించని మద్దతు

ఊహించని మద్దతు

మైసూరు జిల్లా అధికారులు 50 వేల మందితో యోగా చేయించాలని ఆలోచించారు. అయితే అధికారులు ఊహించని స్థాయిలో స్సందన వచ్చింది. ఇప్పటికే 51,463 మంది తమ పేర్లు నమోదు చేసుకుని అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనడానికి సిద్దంగా ఉన్నారు.

6 వేల మంది విద్యార్థులు

6 వేల మంది విద్యార్థులు

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా యోగా చెయ్యడానికి ఆరు వేల మంది పాఠశాల విద్యార్థులు సిద్దం అయ్యారు. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ఒకే చోట ఆరు వేల మంది విద్యార్థులు పాల్గొనడం ఏంతో సంతోషంగా ఉందని అధికారులు అంటున్నారు.

ఇంకా చాన్స్ ఉంది

ఇంకా చాన్స్ ఉంది

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనడానికి ఆసక్తి ఉన్న వారు వారి పేర్లు నమోదు చేసుకోవడానికి ఇంకా అవకాశం ఉందని మైసూరు జిల్లా అధికారులు అంటున్నారు. వీలైనంత మందితో ఒకే చోట యోగా చేయించి గిన్నిస్ బుక్ రికార్డులో చోటు సంపాధించాలని నిర్ణయించారు.

 మహిళలకు ప్రత్యేకంగా

మహిళలకు ప్రత్యేకంగా

మైసూరు నగరంలోని చామరాజ, నరసింహరాజ, జయచామరాజ, కృష్ణరాజ ప్రాంతాల్లో ఇప్పటికే యోగా శిక్షణ శిభిరాలు నిర్వహించారు. మహిళలకు సాయంత్రం 5.30 నుంచి 7.30 గంటలకు ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించారు. యోగా శిక్షణా శిభిరాల దగ్గర డ్రోన్లతో వీడియో చిత్రీకరించారు.

గిన్నీర్ రికార్డు గ్యారెంటీ !

గిన్నీర్ రికార్డు గ్యారెంటీ !

జూన్ 21 బుధవారం అంతర్జాతీయ దినోత్సవంలో పాల్గొనడానికి ఆసక్తి ఉన్న వారు మైసూరులోని పర్యాటక శాఖ, ఆయుష్, నెహ్రూ యువ కేంద్రం, మైసూరు నెట్ వర్కింగ్ సంస్థ, మైసూరు ఆర్ టీఓ కార్యాలయం, మైసూరు హోటల్ యజమానుల సంఘం, మైసూరు ట్రావెల్స్ అసోసియేసన్ సంస్థల్లో వారి పేర్లు నమోదు చేసుకోవాడినికి అవకాశం ఉంది. మొత్తం మీద 50 వేల మందికి పైగా ఒకే చోట యోగా చేసి ప్రంపంచ రికార్డు సృష్టించడానికి మైసూరు నగరం వేదిక అయ్యింది.

English summary
In Mysuru, 51,463 people have already registered to take part in a mass Yoga demonstration on June 21. The rehearsals on Sunday were glimpses of what is to come on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X