వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆఫ్రికా ప్రజలపై నిఘా: రక్షణ కల్పిస్తాం

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరు నగరంలో నివాసం ఉంటున్న ఆఫ్రికా జాతీయుల కార్యకలాపాల మీద పూర్తి నిఘా వెయ్యాలని పోలీసు అధికారులు భావించారు. 50 మందితో సమన్వయ సమితి ఏర్పాటు చేసి మూడు నెలలకు ఒక సారి సమావేశం ఏర్పాటు చేస్తామని బెంగళూరు నగర అడిషనల్ పోలీసు కమిషనర్ హరిశేఖరన్ అన్నారు.

ఒక డీసీపీ, ఆఫ్రికా రాయబార కార్యాలయంలోని అధికారులు, ఆఫ్రికా దేశస్తులుతో కలిపి 25 మంది, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, స్థానికులు 25 మందితో కలిపి సమన్వయ సమితి ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమితి సభ్యులు మూడు నెలలకు ఒక సారి సమావేశం ఏర్పాటు చేస్తారు.

ఆ సమయంలో ఆఫ్రికా దేశస్తులకు ఎలాంటి సమస్యలు ఉన్నా నిర్బయంగా చెప్పవచ్చని అంటున్నారు. అదే విదంగా వీసా గడువు పూర్తి అయితే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని హరిశేఖరన్ చెప్పారు. విద్యాభ్యాసం కోసం బెంగళూరు వచ్చిన ఆఫ్రికా దేశస్తులు వివిద కారణాల వలన స్థానికులతో గొడవ పడుతున్నారని చెప్పారు.

అధికారికంగా బెంగళూరు నగరంలో 540 మంది ఆఫ్రికా దేశస్తులు నివాసం ఉంటున్నారు. వీరు దాదాపు పై చదువుల కోసం బెంగళూరు వచ్చారు. వీసా గడువు పూర్తి అయినా అనేక కారణాల వలన చాల మంది ఆఫ్రికన్లు బెంగళూరులోనే మకాం వేశారని పోలీసు అధికారులు అంటున్నారు.

540 african citizens in bangalore

విద్యాభ్యాసం చేస్తున్న ఆఫ్రికా యువతులు ఆర్థిక లావాదేవీల సమస్యలతో హైటెక్ వేశ్యవాటిక కేంద్రాలకు వెళుతున్నారని హరిశేఖరన్ అంటున్నారు. బెంగళూరు-పాతమద్రాసు రోడ్డులోని కేఆర్ పురం, ఐటీపీఎల్ సమీపంలోని వైట్ ఫీల్డ్ తదితర చోట్ల కార్లు నిలిపి విటులను ఆకర్షిస్తున్నారని అన్నారు.

ఒక రాత్రికి రూ. 5 వేలు, రూ. ఆరు వేలు తీసుకుని ఒళ్లు అమ్ముకుంటున్నారని విచారం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా డగ్ర్స్ విక్రయిస్తున్నారని, సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని అనేక సార్లు వెలుగు చూసిందని హరిశేఖరన్ వివరించారు. ఆఫ్రికా దేశస్తుల నేరాలు అరికట్టడానికి సమన్వయ సమితి ఏర్పాటు చేస్తున్నామని బెంగళూరు నగర జాయింట్ పోలీసు కమిషనర్ హరిశేఖరన్ వివరించారు.

సుమోటో కేసు నమోదు..............!

గత కొన్ని రోజుల క్రితం బెంగళూరు కొత్తనూరు ప్రాంతంలో నలుగురు ఆఫ్రికా దేశస్తుల మీద స్థానికులు దాడి చేశారు. దాడికి గురైన వారిలో ఒక యువతి ఉంది. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు విచారణ జరిపించారు. స్థానికులు దాడి చేశారని వెలుగు చూసింది.

స్థానికుల మీద పోలీసులు సుమోటో కేసు నమోదు చేశారు. బుద్దిగా చదువుకునే ఆఫ్రికా దేశస్తులకు పూర్తి రక్షణ కల్పిస్తామని, నేరాలకు పాల్పడే వారిని జైలుకు పంపిస్తామని బెంగళూరు పోలీసులు హెచ్చరించారు.

English summary
Four African nationals were allegedly attacked by a mob at Byrathi in Bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X