చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భారత్ లో 55% వివాహితులు జీవిత భాగస్వామిని మోసం చేస్తున్నారు, సర్వే షాక్, లేడీస్ లింక్, ఒకేసారి!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/ ముంబై: భారతదేశంలో 55% మంది వివాహితులు వారి భాగస్వాములను (భార్య లేదా భర్త) మోసం చేస్తున్నారని వెలుగు చూసింది. ముఖ్యంగా వివాహిత మహిళలు గుట్టుచప్పుడు కాకుండా వారి భర్తలను మోసం చేస్తున్నారని ఓ సర్వేలో వెలుగు చూసింది. 48 శాతం భారతీయులు ఒకే సారి ఇద్దరిని ప్రేమించడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారని తెలిసింది. 25 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మద్య వయసు ఉన్న 1, 525 మంది భారతీయలను పరిశోధన చేసి సర్వే చేసి ఈ నివేదిక తయారు చేశారు. వివాహిత మహిళలను ఎక్కువగా తన భాగస్వామిని (భర్త) మోసం చేస్తున్నారని గ్లీడెన్ డేటింగ్ యాప్ సర్వేలో వెలుగు చూసింది.

టెక్కీ లవ్ స్టోరీ, వేరే అమ్మాయితో పెళ్లి, సీక్రెట్ ఫోటోలు షేర్ చేసిన ప్రియురాలు, రివాల్వర్ తో కాల్చిటెక్కీ లవ్ స్టోరీ, వేరే అమ్మాయితో పెళ్లి, సీక్రెట్ ఫోటోలు షేర్ చేసిన ప్రియురాలు, రివాల్వర్ తో కాల్చి

 ఆ విషయంలో నమ్మక ద్రోహం

ఆ విషయంలో నమ్మక ద్రోహం

భారతదేశంలో 55 శాతం మంది వివాహితులు భాగస్వామికి (భర్త లేదా భార్యకు) నమ్మకద్రోహం చేస్తున్నారని గ్లీడెన్ డేటింగ్ యాప్ సర్వేలో వెలుగు చూసింది. భాగస్వామిని మోసం చేస్తున్న వారిలో ఎక్కువ మంది మహిళలు ఉన్నారని వెలుగు చూసింది. వివాహితులు ఎక్కువగా ఇతరుల ఆకర్షణకు లోనవుతున్నారని తెలిసింది.

ఇద్దరి ప్రేమలో పడుతున్నారు

ఇద్దరి ప్రేమలో పడుతున్నారు

భారతదేశంలో 48 శాతం మంది ఒకే సారి ఇద్దరిని ప్రేమించడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారని తెలిసింది. ఇందులో వివాహిత పురుషులు, స్త్రీలు ఉన్నారు. అందులో 46 శాతం మంది ప్రేమిస్తున్నట్లు మరోకరిని సులభంగా మోసం చేస్తున్నారని వెలుగు చూసింది.

అంతేనా, క్షమించాను పో!

అంతేనా, క్షమించాను పో!

తన జీవిత భాగస్వామి తనను మోసం చేస్తున్నారని తెలుసుకున్నవారిలో చాల మంది వారి జీవిత భాగస్వాములను ఈజీగా క్షమిస్తున్నారని సర్వేలో వెలుగు చూసింది. అయితే తన భాగస్వామి విషయం తెలుసుకున్న తరువాత వారు కనీసం 40 శాతం పరిస్థితులు మారిపోయి మనసు మార్చుకుంటేనే క్షమిస్తున్నారని సర్వేలో వెలుగు చూసింది. అయితే 7 శాతం మంది రెండో ఆలోచన లేకుండా సులభంగా భాగస్వామిని క్షమించి దగ్గర చేసుకుంటున్నారని వెలుగు చూసింది.

మహానగరాల్లో ఎక్కువ!

మహానగరాల్లో ఎక్కువ!

ఢిల్లీ, బెంగళూరు, ముంబై, హైదరాబాద్, పూణే, చెన్నై. కోల్ కతా, అహమ్మదాబాద్ నగరాల్లో 25 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయసు మధ్యలోని 1, 525 మందిని పరిశోధన చేసి వివరాలు సేకరించగా వారి జీవిత భాగస్వాములు ఎంత సులభంగా మోసం చేస్తున్నారో అనే ఈ విషయాలు వెలుగు చూశాయి.

విడాకులు తక్కువ

విడాకులు తక్కువ

2017 నుంచి గ్లీడెన్ భారతదేశంలో సుమారు 3 లక్షల మందికి పైగా పరిశోధనలు చేసి సర్వేలు చేస్తున్నది. ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే భారతదేశంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని వెలుగు చూసింది. 1,000 మందిలో కేవలం 13 మంది మాత్రమే విడాకులు తీసుకుంటున్నారని తెలిసింది. అంతే కాకుండా 90 శాతం భారతీయ వివాహాలు పెద్దలు నిర్ణయం మేరకే జరుగుతున్నాయని, 5 శాతం మంది మాత్రమే పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహాలు చేసుకుని జీవిస్తున్నారని సర్వేలో వెలుగు చూసింది.

49 శాతం ‘ఆ' సంబంధాలు!

49 శాతం ‘ఆ' సంబంధాలు!

భారతదేశంలో 49 శాతం మంది వివాహితులు తమ జీవిత భాగస్వామిని కాకుండా వేరేవారితో సన్నిహిత సంబంధాలు (అక్రమ సంబంధాలు) సాగిస్తున్నారని అంగీకరించారని సర్వే తెలిపింది. 10 మందిలో 5 మంది సాధారణ సెక్స్ ఇష్టపడుతున్నారని, 41 శాతం మహిళలు తమ జీవిత భాగస్వామి కాకుండా వేరే వారితో క్రమం తప్పకుండా లైంగిక కోరికలు తీర్చుకుంటున్నారని సర్వేలో వెలుగు చూసింది.

Recommended Video

Telangana CM KCR Stops Convoy For Disabled Man | He Is The People Leader | Oneindia Telugu
వివాహిత మహిళల ఆకర్షణ

వివాహిత మహిళల ఆకర్షణ

26 శాతం మంది పురుషులు వివాహిత మహిళలతో లైంగిక సంబంధాలు పెట్టుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారని సర్వేలో వెలుగు చూసింది. 53 శాతం మంది వివాహం కాకముందే వేరేవారితో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నారని మా పరిశోధనలో వెలుగు చూసిందని గ్లీడెన్ సర్వే వివరాలు వెల్లడించింది.

English summary
48% of Indians believe that it is possible to be in love with two people at the same time. This research was conducted among 1,525 Indian married individuals between the age of 25 and 50.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X