వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

57 మందికి కరోనాపై ఎన్‌హెచ్ఆర్సీ: యూపీ సీఎస్, డీజీపీకి నోటీసులు, నివేదిక ఇవ్వాలని ఆదేశం, సుమోటోగా...

|
Google Oneindia TeluguNews

కాన్పూర్ ప్రభుత్వ వసతి గృహంలో 57 మందికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన అంశం దేశాన్ని కుదిపేస్తోంది. 57 మందికి కరోనా రాగా ఇందులో ఐదుగురు గర్భం దాల్చారు. కరోనా నెగిటివ్ వచ్చిన మరో ఇద్దరు కూడా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యింది. ఒకరికీ హెచ్ఐవీ పాజిటివ్ రాగా, మరొకరు కూడా వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి, డీజీపీకి నోటీసులు జారీచేసింది. ఘటనకు సంబంధించి పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీచేసింది.

వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్: కలకలం: అసెంబ్లీ సమావేశాలకు హాజరు.. రాజ్యసభ ఎన్నికల్లో ఓటువైసీపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్: కలకలం: అసెంబ్లీ సమావేశాలకు హాజరు.. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు

 సుమోటోగా..

సుమోటోగా..

కాన్పూరు ప్రభుత్వ వసతిగృహంలో 57 మంది విద్యార్థినిలకు కరోనా అనే వార్త సోమవారం సోషల్ మీడియాలో వైరలైంది. దీనిని ఎన్‌హెచ్ఆర్సీ సుమోటోగా తీసుకుంది. మీడియా కథనాల ఆధారంగా స్పందిస్తూ.. కాన్పూర్ ఘటన నిజమైతే సదరు విద్యార్థినులకు రక్షణ కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. జీవించే హక్కు, స్వేచ్చను అక్కడి ప్రభుత్వం హరించింది అని తీవ్రంగా కామెంట్ చేసింది. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి, అందిస్తోన్న వైద్య చికిత్సపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది.

 డీజీపీకి నోటీసులు

డీజీపీకి నోటీసులు

యూపీ డీజీపీకి కూడా నోటీసులు జారీచేసింది. ఘటనకు సంబంధించి ఎఫ్ఐఆర్ కాపీ, విచారణకు సంబంధించి నివేదిక అందజేయాలని కోరింది. ఘటనపై వీలైనంత త్వరగా సీఎస్, డీజీపీ నివేదిక అందజేయాలని స్పష్టంచేసింది. ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపిస్తుందని విశ్వాసం వ్యక్తం చేసింది. ఎన్‌హెచ్ఆర్సీతోపాటు ఉత్తరప్రదేశ్ మహిళ కమిషన్ కూడా ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వాలని కాన్పూర్ జిల్లా కలెక్టర్‌ను కోరింది.

 ఇకపై పటిష్ట చర్యలు

ఇకపై పటిష్ట చర్యలు

కాన్పూర్ షెల్టర్ హోం ఘటన దుమారం రేపడంతో.. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. రాష్ట్రంలోని అన్ని మహిళ షెల్టర్ హోమ్స్, జువైనల్ హోం వద్ద కరోనా వైరస్ నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని స్పష్టంచేసింది. ఈ మేరకు సీఎస్ రాజేంద్ర కుమార్ ఆదేశాలు జారీచేశారు. వసతి గృహల్లోకి వచ్చే సిబ్బందిని విధిగా చెక్ చేయాలని పేర్కొన్నారు. దగ్గు, జలుబు, జ్వరంతో ఉన్నవారిని అనుమతించొద్దు అని స్పష్టంచేశారు. ఆయా వసతి గృహల్లో శానిటైజర్లు, మాస్క్, కర్చీప్ అందుబాటులో ఉంచాలన్నారు. భౌతికదూరం తప్పనిసరిగా పాటించాలని తేల్చిచెప్పారు.

ఆదేశాలు

ఆదేశాలు


షెల్టర్ హోంలలో నిబంధనలు కచ్చితంగా పాటించాలని అడిషనల్ సీఎస్, ప్రిన్సిపల్ సెక్రటరీ, సోషల్ వెల్పేర్ అండ్ ఉమన్ అండ్ చైల్డ్ డెవలప్ మెంట్ డిపార్ట్ మెంట్లకు ఆదేశాలు జారీచేశామని తెలిపారు. అంతేకాదు సంబంధిత వసతి గృహలకు సంబంధించిన నిర్వాహకులు సమీపంలోనే ఉండాలని స్పష్టంచేశారు.

Recommended Video

Sushant Singh Rajput : Kriti Sanon Heart Breaking Tribute To Sushant | సుష్.. నీ శత్రువు అదే
ప్రియాంక, అఖిలేష్ ఫైర్

ప్రియాంక, అఖిలేష్ ఫైర్

యూపీ ప్రభుత్వ తీరును కాంగ్రెస్ నేత ప్రియాంకగాంధీ ఎండగట్టారు. ముజఫర్ నగర్, డియోరియా ఘటనలు జరగకముందే మరో ఘటన జరిగిందని గుర్తుచేశారు. ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత విచారణ పేరుతో జాప్యం జరుగుతుంటే తప్ప.. మరో ఘటన జరగకుండా నివారించడం లేదన్నారు. షెల్టర్ హోంలోని బాలికులు గర్భం దాల్చడంపై నిష్పక్షిపాతంగా దర్యాప్తు చేయాలని ప్రభుత్వాన్ని ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ డిమాండ్ చేశారు.

English summary
nhrc has sent notices to the Uttar Pradesh government and the state police chief over reports that 57 minor girls tested positive for Covid-19 at the state-run shelter home in Kanpur
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X