వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

57% కేసులు మహారాష్ట్ర నుంచే, 6 రోజుల్లో 237 మందికి వైరస్, కర్ణాటకలో కరోనా వైరస్ కలవరం..

|
Google Oneindia TeluguNews

కర్ణాటకలో కరోనా వైరస్ కేసులు వేగంగా పెరిగిపోతున్నాయి. గత ఆరు రోజుల్లో నమోదైన కేసుల్లో ఎక్కువశాతం మహారాష్ట్ర నుంచి వచ్చినవారికే రికార్డవుతోంది. రాష్టంలో కేసుల్లో అది 57 శాతం ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మే 14 నుంచి మే 19వ తేదీ వరకు 414 కేసులు నమోదు కాగా.. వీరిలో 57.25 శాతం అంటే 237 మంది మహారాష్ట్ర నుంచి తిరిగొచ్చిన వారేనని అధికారులు చెబుతున్నారు.

డొనాల్డ్ ట్రంప్‌కు కరోనా భయం,రోజూ హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ టాబ్లెట్, సైడ్ ఎఫెక్ట్స్ అంటోన్న నిపుణులుడొనాల్డ్ ట్రంప్‌కు కరోనా భయం,రోజూ హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ టాబ్లెట్, సైడ్ ఎఫెక్ట్స్ అంటోన్న నిపుణులు

64 వేల మంది

64 వేల మంది

మే 15వ తేదీ వరకు 64 వేల 674 మందికి కర్ణాటక తిరగొచ్చారు. సేవా సింధు సర్వీస్ ద్వారా రాష్ట్రంలోకి వచ్చేందుకు లక్ష 16 వేల 761 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే వీరిలో మహారాష్ట్రకు చెందినవారు ఎంతమంది ఉన్నారో తెలియాల్సి ఉంది. మాండ్య, హసన్, శివమొగ్గ, రాయిచూర్, కొప్పల్, విజయపుర, కలబురగి, యాద్గిర్, ఉత్తర కన్నడ జిల్లాలకు మహారాష్ట్ర సరిహద్దుల నుంచి ప్రజలు చేరుకున్నారు. మాండ్య జిల్లా నుంచి ఎక్కువ మంది వచ్చినట్టు గుర్తించారు. గత 6 రోజుల్లో 48 శాతం అంటే 114 మంది వచ్చినట్టు తెలుస్తోంది.

15 రోజుల నుంచి

15 రోజుల నుంచి


గత 15 రోజుల నుంచి కూడా మహారాష్ట్ర నుంచి వచ్చినవారి సంఖ్య ఎక్కువగానే ఉంది. అయితే వచ్చిన ప్రతీ ఒక్కరినీ క్వారంటైన్ చేస్తున్నామని, వారికి మాండ్యలో గల ప్రజలతో సంబంధం లేదని కలెక్టర్ వెంకటేశ్ తెలిపారు. వలస కూలీల నుంచి రక్త నమూనాలను కూడా సేకరిస్తున్నామని తెలిపారు. మంగళవారం 60 మందికి పరీక్షలు చేశామని చెప్పారు. ఇవాళ రాష్ట్రంలో 127 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 62 మాండ్యలోనే నమోదయ్యాయి.

గుజరాత్ కూడా

గుజరాత్ కూడా

కరోనా వైరస్ కేసులు నమోదవడంతో మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు నుంచి అంతరాష్ట్ర ప్రయాణాలను ప్రభుత్వం నిషేధం విధించింది. మహారాష్ట్రతోపాటు గుజరాత్ నుంచి కూడా ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. గడాక్, కలబురాగి, యాద్గిర్ నుంచి వైరస్ వ్యాపిస్తోంది. దీంతో కర్ణాటక ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. వైరస్ కేసులు నమోదవుతున్న ప్రాంతాల నుంచి.. ప్రజలను అనుమతించబోమని తేల్చిచెబుతోంది.

English summary
last six days, over half of the COVID-19 cases reported in Karnataka were of people who had returned from Maharashtra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X