వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

coronavirus:ఒక్కరోజులో 58 మంది మృతి, మహారాష్ట్రలో మరణ మృదంగం, 27 మంది మృత్యువాత

|
Google Oneindia TeluguNews

దేశంలో కరోనా వైరస్ పాజివిట్ కేసులకు బ్రేక్ పడటం లేదు. వైరస్ సోకిన వారి సంఖ్య 30 వేలకు చేరింది. సోమవారం మధ్యప్రదేశ్‌లో గల ఇండోర్‌లో పాజిటివ్ కేసుల సంఖ్య 196కి చేరడంతో... మొత్తం 29 వేల 571కి చేరింది. మహారాష్ట్రలో 522, గుజరాత్‌లో 247 మందికి పాజిటివ్ సోకింది. ముంబైలో 369 కేసులు నమోదు కాగా.. ఢిల్లీలో 190 మందికి పాజిటివ్ వచ్చింది. ఆదివారం 293 నమోదు కాగా.. సోమవారానికి సగం వరకు తగ్గింది. కానీ గతవారం సగటుతో పోలిస్తే రెట్టింపవడం ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3 వేలకు చేరింది.

బీహర్, జార్ఖండ్‌లో కూడా సోమవారం పాజిటివ్ కేసులు ఎక్కువగానే నమోదయ్యాయి. బీహార్‌లో 68 కాగా, జార్ఖండ్‌లో 28 కేసులు రికార్డయ్యాయి. మరోవైపు సోమవారం ఒక్కరోజు 58 మంది చనిపోయారు. దేశంలో అత్యంత ఎక్కువ పాజిటివ్ కేసులతో మొదటిస్థానంలో ఉన్న మహారాష్ర్టలో ఒక్కరోజే 27 మంది చనిపోయారు. తర్వాత గుజరాత్‌లో 11, రాజస్థాన్ 9, మధ్యప్రదేశ్ 7, పశ్చిమ బెంగాల్‌లో ఇద్దరు, పంజాబ్, ఉత్తర ప్రదేశ్‌లో ఒకరు చొప్పున చనిపోయారు. దీంతో కరోనా వైరస్‌ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 937కి చేరింది. వరసగా మూడోరోజు 50 మందికి పైగా చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది.

58 die of Covid infection, highest in a day, cases inch close to 30 thousand..

Recommended Video

Lockdown In AP will Be Eased in Green Zones Across The State

937 మరణాల్లో మహారాష్ట్రలో 369 మంది చనిపోయారు. ఇందులో 219 మంది ముంబైలో మృతిచెందారు. సోమవారం 522 పాజిటివ్ కేసులతో.. మొత్తం 8 వేల 590 మందికి వైరస్ సోకింది. ఇందులో 70 శాతం అంటే 5 వేల 776 పాజిటివ్ కేసులు ముంబైలో నమోదయ్యాయి. అహ్మదాబాద్‌లో వైరస్ సోకి చనిపోయిన వారి సంఖ్య 4.7 శాతంగా ఉంది. ఇది ముంబైతో 3.8 పోలిస్తే అధికంగా ఉండటం విశేషం. గుజరాత్‌లో జరిగిన మరణాల్లో 67.5 శాతం మంది అహ్మదాబాద్‌లోనే చనిపోయారు. రాజస్థాన్‌లో సోమవారం 9 మంది చనిపోగా.. రాష్ట్రంలో చనిపోయిన వారి మొత్తం సంఖ్య 50కి చేరింది. సోమవారం 77 పాజిటివ్ కేసులతో మొత్తం రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 2 వేల 262కి చేరింది.

English summary
one day 58 die due to covid-19 in country. maharashtra recorded 27 new coronavirus deaths.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X