వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైఎస్ జగన్ బాటలో నెచ్చెలి శశికళ: ఓదార్పు యాత్ర

వైఎస్ జగన్ బాటలో శశికళ ఓదార్పు యాత్ర చెయ్యడానికి సిద్దం అయ్యారు. జయలలిత మరణాన్ని తట్టుకోలేక తమిళనాడులో 597 మంది మృతి చెందారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన నెచ్చెలి శశికళ నటరాజన్ తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేయనున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లను ఆమె సన్నిహితులు దగ్గరుండి చూసుకుంటున్నారు.

<strong>జయలలిత లాగా శశికళ కట్టు, బొట్టు మార్చేసి అమ్మ కారులో</strong>జయలలిత లాగా శశికళ కట్టు, బొట్టు మార్చేసి అమ్మ కారులో

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణాన్ని చూసి తట్టుకోలేక మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించడానికి శశికళ సిద్దం అయ్యారు. జయలలిత మరణించినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 597 మందికిపైగా మరణించారు.

అమ్మ మీద అభిమానంతో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించడానికి అన్నాడీఎంకే చీఫ్ శశికళ ఇప్పుడు సిద్దం అయ్యారు. శశికళ ఓదార్పు యాత్రకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే సమయంలో ఆ కుటుంబాలకు పార్టీ నుంచి అందించాల్సిన సాయం చెక్కులను శశికళ స్వయంగా పంపిణి చెయ్యనున్నారు.

597 people died unable to bear demise of J Jayalalithaa, AIADMK says

<strong>పన్నీర్ సెల్వం రాజీనామా ? ఎక్కడ చూసినా ఇవే ఫ్లెక్సీలు</strong>పన్నీర్ సెల్వం రాజీనామా ? ఎక్కడ చూసినా ఇవే ఫ్లెక్సీలు

మొత్తం మీద అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు చేపట్టిన శశికళ రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేసి ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు దగ్గర కావడానికి సిద్దం అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేస్తూ హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్. రాజశేఖర్ రెడ్డి మరణించిన విషయం తెలిసిందే.

ఆ సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను ఓదార్చడానికి ఆయన కుమారుడు జగన్ సుడిగాలి పర్యటన (ఓదార్పు యాత్ర) చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు జగన్ బాటలోనే శశికళ కూడా ఓదార్పు యాత్ర చేపట్టడానికి తమిళనాడులో సుడిగాలి పర్యటన చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు.

English summary
The AIADMK party headquarters announced financial assistance of Rs 3 lakh to the bereaved families of 127 people. Earlier, the party had announced financial aid to the families of 470 people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X