• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సీఏఏ నిరసనల్లో యువకుడి హత్య..ఆరుగురు అరెస్టు, నిందితుల్లో హిందూ సంఘాల వారు

|

బీహార్ : పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బీహార్‌లోని ఆర్జేడీ పార్టీ కూడా సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టింది. ఈ నిరసన కార్యక్రమాల్లో జాతీయ జెండా పట్టుకుని నిరసనలు తెలిపిన ఓ యువకుడు అదృశ్యమయ్యాడు. ఆ తర్వాత పది రోజులకు శవమై కనిపించాడు. దీనిపై విచారణ చేసిన పోలీసులు 6 మందిని అరెస్టు చేశారు. ఇందులో ఇద్దరు హిందూ సంఘాలకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు.

 అదృశ్యమైన నిరసనకారుడు.. శవమై కనిపించిన ఆమిర్

అదృశ్యమైన నిరసనకారుడు.. శవమై కనిపించిన ఆమిర్

ఆర్జేడీ నిరసన కార్యక్రమంలో ఆమిర్ హన్జాలా అనే 18 ఏళ్ల యువకుడు నిరసనల తర్వాత కనిపించకుండా పోయాడు. అనంతరం డిసెంబర్ 31వ తేదీన శవమై కనిపించాడు. ఘటనకు సంబంధించి పోలీసులు ఆరుగురు మందిని అరెస్టు చేయగా ఇందులో హిందూ పుత్ర సంఘటన్‌కు చెందిన నగేష్ సామ్రాట్, హిందూ సమాజ్ సంఘటన్‌కు చెందిన వికాస్ కుమార్‌లు ఉన్నట్లు పోలీసులు చెప్పారు. ఆ రోజున జరిగిన ఆందోళనల సందర్భంగా పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేయగా ఆమిర్ హంజాలా ఆ చోటును విడిచి వెళుతుండగా సంగత్ గాలి ప్రాంతంలో కొందరు ఆమిర్ హంజాలాను

ఆమిర్‌పై ఇటుకలు, ఇతర వస్తువులతో దాడి

ఆమిర్‌పై ఇటుకలు, ఇతర వస్తువులతో దాడి

అదృశ్యమైన ఆమిర్ మృతదేహం కనిపించగా పోస్టుమార్టంకు తరలించామని చెప్పిన పోలీసులు... ఆమిర్‌ను హత్య చేసేందుకు నిందితులు ఇటుకలు ఇతర పదునైన ఇనుప వస్తువులు వినియోగించినట్లు పోస్టుమార్టం రిపోర్ట్ ద్వారా వెల్లడైందని చెప్పారు.తలపై గాయాలు, శరీరంపై రెండు చోట్లు గాట్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. పొత్తి కడుపులో తీవ్రగాయాలయ్యాయని ఆ తర్వాత శరీరం నుంచి తీవ్ర రక్తస్రావం జరిగిందని వైద్యులు గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు.

జాతీయ జెండా పట్టుకోవడం తప్పా: తండ్రి

జాతీయ జెండా పట్టుకోవడం తప్పా: తండ్రి

ఇదిలా ఉంటే తన కొడుకు తొలిసారిగా ఒక నిరసన కార్యక్రమంలో పాల్గొన్నాడని అయినా తాను చేసిన తప్పేంటని ఆమిర్ తండ్రి ప్రశ్నించారు. జాతీయ జెండా పట్టుకోవడం ఆమిర్ చేసిన తప్పా అంటూ ప్రశ్నిస్తూ కన్నీరుమున్నీరయ్యాడు. గత మే నెలలో హిందూ సంఘాలకు సంబంధించిన కార్యాలయాలు వారి కార్యకలాపాలపై నివేదిక ఇవ్వాలని బీహార్ పోలీస్ స్పెషల్ బ్రాంచ్ కోరింది. అంతేకాదు అందులో పనిచేసే సిబ్బంది లేదా కార్యకర్తల వివరాలు కూడా ఇవ్వాలని కోరింది. ఈ జాబితాలో హిందు పుత్ర సంఘటన్‌తో పాటు మరో 19 హిందూ సంఘాలు ఉన్నట్లు పోలీసులు నిర్థారించారు.

 నిందితులు ఇచ్చిన సమాచారంతోనే మృతదేహం దొరికింది

నిందితులు ఇచ్చిన సమాచారంతోనే మృతదేహం దొరికింది

ఆమిర్ హత్య కేసులో అరెస్టు అయిన వారిలో దీపక్ మహతో, చోటు మహతో, సనోజ్ మహతో, రాయిస్ పాశ్వాన్‌లు ఉన్నారని వీరిపై ఇంతకు ముందు కూడా క్రిమినల్ కేసులు ఉన్నాయని పోలీసులు చెప్పారు. దీపక్, చోటు మరియు సనోజ్‌లు ఇచ్చిన సమాచారంతోనే ఆమిర్ మృతదేహంను కనుగొన్నట్లు పోలీసులు చెప్పారు. అంతేకాదు నిరసనల సందర్భంగా సామ్రాట్, కుమార్‌ ఏమైనా హింసకు పాల్పడ్డారా అన్న కోణంలో కూడా విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. వీరిద్దరూ పాట్నా వాసులు కాదని మూడేళ్ల క్రితం జరిగిన మతపరమైన అల్లర్లలో కూడా వీరున్నారని పోలీసులు చెప్పారు.

English summary
Bihar Police have arrested six people including two people from Hindu outfits in the murder case of Amir hanzal who participated in the protests called by RJD on December 21st.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X