వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

coronavirus: ఆరు మెట్రో నగరాలు రెడ్ జోన్, పాజిటివ్ కేసులు ఎక్కువే, హైదరాబాద్‌‌లో 197..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ ప్రభావం ఉన్న ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. 170 జిల్లా హాట్ స్పాట్ కేంద్రాలుగా ప్రకటించింది. అయితే ఆరు మెట్రో నగరాల్లో కూడా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీ, అందులోని 9 జిల్లాలు, ముంబైలోని కొన్ని ప్రాంతాలు, కోల్‌కతా, బెంగళూరు అర్బన్, హైదరాబాద్, చెన్నై సహా జైపూర్, ఆగ్రా నగరాలు కూడా ఉన్నాయి.

మెట్రో నగరాలు

మెట్రో నగరాలు

మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబై, కోల్ ‌కతా, చెన్న, బెంగళూరు, హైదరాబాద్‌లో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో బుధవారం ఒక్కరోజే 1896 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో పాజిటివ్ కేసుల సంఖ్య 2916 కాగా అందులో సగానికిపైగా ముంబైలోనే ఉన్నాయి. ఢిల్లీలో 1561 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 30 మంది కోలుకున్నారు. మరో 30 మంది చనిపోయారు. 56 ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. అవసరమైన సేవలు తప్ప.. మిగిలినవాటిపై నిషేధం విధించారు.

భాగ్యనగరంలో.,

భాగ్యనగరంలో.,

హైదరాబాద్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల మొత్తం సంఖ్య 267కి చేరుకున్నది. ఇందులో 70 మంది వైరస్ తగ్గి డిశ్చార్జ్ కాగా.. ప్రస్తుతం 197 మంది ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. సిటీని 17 జోన్లుగా విభజించారు. ఒక్కో జోన్ యూనిటిగా పరిగణించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఒక్కో యూనిట్‌కు పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, వైద్యశాఖ అధికారులకు బాధ్యతలు అప్పగించారు. కంటైన్మెంట్ జోన్లలో మరింత పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. పాజిటివ్ కేసుల ఆధారంగా రాష్ర్టం మొత్తాన్ని 246 జోన్లుగా విభించగా.. హైదరాబాద్‌లోనే 126 కంటోన్మెంట్ జోన్లు ఉన్నాయి.

Recommended Video

Woman Covers Her Face While Seeing A China Girl In Metro | ఈ మహిళ ని సమర్దిస్టారా?
ఇవీ జోన్లు..

ఇవీ జోన్లు..

వైరస్ వ్యాప్తిని బట్టి రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించారు. రెడ్ జోన్‌లో దేశవ్యాప్తంగా 170 జిల్లాలు ఉన్నాయి. అరెంజ్ జోన్‌లో 207 జిల్లాలు ఉన్నాయి. రెడ్ జోన్ ఉన్న పరిధిలో 14 రోజుల్లో వైరస్ కేసులు నమోదు కాకుంటే ఆరంజ్ జోన్‌గా ప్రకటిస్తారు. అప్పుడు కూడా కేసులు నమోదు కాకుంటే... గ్రీన్ జోన్‌గా ఆనౌన్స్ చేస్తారు. గ్రీన్ జోన్ అంటే కరోనా ఫ్రీ అని.. ఒక్క పాజిటివ్ కేసు కూడా లేదు అని అర్థం.

English summary
All six metros - Delhi, Mumbai, Kolkata, Chennai, Bengaluru and Hyderabad - currently have a high number of cases.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X