వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముంబై ఈఎస్ఐసీ హాస్పిటల్‌లో అగ్నిప్రమాదం: 6నెలల చిన్నారితో సహా ఎనిమిది మంది మృతి

|
Google Oneindia TeluguNews

ముంబై: ముంబైలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 8 మంది చనిపోయారు. వీరిలో 6నెలల చిన్నారి కూడా ఉంది. ముంబైలోని మరోల్ ప్రాంతంలో ఉన్న ఈఎస్ఐసీ కామ్‌గర్ ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. సోమవారం ఆరుగురు మృతి చెందగా మంగళవారం మరో ఇద్దరు మృతి చెందారు. మొత్తం మీద 176 మంది ఈ మంటల బారిన పడ్డారు. తీవ్రగాయాలపాలైన వీరికి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో ముగ్గురు ఫైర్ సేఫ్టీ సిబ్బంది కూడా ఉన్నారు. గాయపడిన వారిలో 25 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. మరో 26 మందికి ప్రాథమిక చికిత్స అందించి డిశ్చార్జ్ చేసినట్లు వైద్యులు తెలిపారు.

సాయంత్రం సమయంలో చెలరేగిన మంటలు

సాయంత్రం సమయంలో చెలరేగిన మంటలు

సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆస్పత్రిలో మంటలు చెలరేగాయని ఫైర్ సిబ్బందికి ఫోన్ రావడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది ఫైర్ సిబ్బంది. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు 10 ఫైర్ ఇంజిన్లను వినియోగించారు. అదే సమయంలో పేషంట్లను ఖాళీ చేయించే ప్రయత్నం చేశారు. 16 అంబులెన్స్‌లు ఘటనా స్థలంకు చేరుకుని మంటల బారిన పడి బయటపడ్డ వారిని ఆస్పత్రికి తరలించడంలో కీలక పాత్ర పోషించాయి. గాయపడిన వారిని, హాస్పిటల్‌లో ఉన్న ఇతర పేషంట్లను విలే పార్లేలోని కూపర్ హాస్పిటల్‌కు తరలించారు. మరికొందరిని సెవెన్ హిల్స్, హిందు హృదయ్ సామ్రాట్ బాలాసాహెబ్ థాకెరే హాస్పిటల, జోగేశ్వరి మరియు హోలీ స్పిరిట్ హాస్పిటల్స్‌కు తరలించారు.

సేఫ్టీ టెస్టులో హాస్పిటల్ విఫలం

సేఫ్టీ టెస్టులో హాస్పిటల్ విఫలం

అగ్ని ప్రమాదం ఎలా జరిగిందనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు.ఘటనపై విచారణ జరుగుతోందని ముంబై మేయర్ మహదేశ్వర్ అన్నారు. ఇదిలా ఉంటే ఘటనకు 15 రోజుల ముందు జరిగిన సేఫ్టీ టెస్టులో హాస్పిటల్ విఫలమైందని అధికారులు తెలిపారు. అంతేకాదు హాస్పిటల్‌లో తగిన భద్రత లోపించిందని ఫైర్ సిబ్బంది చెబుతున్నారు. అంతేకాదు హాస్పిటల్‌కు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా లేదని తెలిపారు మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ (ఎమ్ఐడీసీ)అధికారి ఒగాలే. ఎన్ఓసీ కోసం హాస్పిటల్ అధికారులు దరఖాస్తు చేసుకున్నారు కానీ కొన్ని నిబంధనలకు వ్యతిరేకంగా ఉండటంతో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వలేదని ఒగాలే తెలిపారు. అంతేకాదు బిల్డింగ్ ప్రతిపాదన శాఖ కూడా ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఇవ్వలేదని ఒగాలే వెల్లడించారు.

ప్రాణాలు కాపాడుకునేందుకు మూడో అంతస్తు నుంచి దూకిన మహిళ

ప్రాణాలు కాపాడుకునేందుకు మూడో అంతస్తు నుంచి దూకిన మహిళ

అగ్ని ప్రమాదం సంభవించగానే బిల్డింగ్ లోపల గట్టిగా కేకలు వినిపించాయి. హాస్పిటల్ మొత్తం ఆందోళనకరమైన వాతావరణం నెలకొంది. మనీషా అనే మహిళ తన ప్రాణాలను కాపాడుకునేందుకు మూడో అంతస్తు నుంచి కిందకు దూకింది. దీంతో ఆమె రెండో అంతస్తు పైనే పడిపోవడంతో ఆమె కుడి కాలు విరిగింది.ఆమెను అధికారులు కూపర్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. హాస్పిటల్ మొత్తం దట్టమైన పొగతో నిండిపోయిందని తన సోదరి కనిపించకుండా పోయిందని మరో బాలికి సుష్మితా అశోక్ సుతార్ తెలిపింది. ఇక బయటకు దూకుదామనుకునే సరికి ఓ వ్యక్తి తనను పట్టుకుని హాస్పిటల్‌కు తరలించినట్లు చెప్పింది.


మంటల్లో చిక్కుకుని గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో చాలామంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారని డాక్టర్ శ్మృతి ఖేతలా చెప్పారు. అయితే ఘటన ఎలా జరిగింది అనేదానిపై స్పష్టత రానప్పటికీ గ్రౌండ్ ఫ్లోర్‌లో బిల్డింగ్ మరమత్తుల కోసం ఉంచిన సామగ్రిలో మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

English summary
A 6-month-old baby was among 8 killed after massive fire broke out at ESIC Kamgar hospital at Marol in suburban Mumbai on Monday, the police said.Six people were killed on Monday and two died on Tuesday morning, taking the toll of dead to 8.Altogether 176 persons, including three firemen, are now being treated in city hospitals," an official from Disaster Management Unit of BMC said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X