వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విమానంలో ఆగిపోయిన చిట్టి గుండె.. ఆపరేషన్‌కు ముందే...

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : లోకం తెలియని పసిపాప. ఆర్నెల్ల ప్రాయంలోనే వింత జబ్బు. గుండె జబ్బు రక్కసికి వైద్యం చేయించేందుకు ఆ తల్లిదండ్రులు బయల్దేరారు. తమ స్వస్థలం నుంచి దేశ రాజధానికి గంపెడశాలతో వెళ్లారు. కానీ విధి చిన్నచూపు చూసింది. వేగంగా చేరుకునేందుకు విమానంలో బయల్దేరిన ఫలితం లేకపోయింది. ఆ పసిపాప వీడ్కోలు అంటూ తల్లిదండ్రులకు పుత్రశోకాన్ని మిగిల్చి వెళ్లిపోయింది. తమ కూతురు విమానంలోనే చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.

బీహర్ రాష్ట్రంలోని బెగుసరైకి చెందిన ఫ్యామిలీ పుణెలో నివసిస్తోంది. అయితే ఆ దంపతులకు ఆర్నెల్ల క్రితం పాప జన్మించింది. తమకు పాప పుట్టిందనే సంతోషం వారిలో కొంతసేపు కూడా లేదు. ఆమె పసి హృదయంలో హోల్ ఉందనే కఠోర నిజాన్ని వైద్యులు తెలిపారు. పుణెలో వైద్యం చేయించిన ఫలితం లేకపోయింది. దీంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ట్రీట్‌మెంట్ చేయించుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో వారు పాపను తీసుకొని బయల్దేరారు. బస్సులో, రైలులో వెళితే ఇబ్బందవుతుందని విమానంలో బయల్దేరారు. అయినా ఫలితం లేకపోయింది. విధి వెక్కిరించింది. ఆ పసిపాపను తల్లి పొత్తిళ్ల నుంచి తీసుకెళ్లాడు ఆ భగవంతుడు.

6-month-old baby dies on SpiceJet flight from Patna to Delhi

పుణె నుంచి స్పైస్ జెట్ విమానంలో ఢిల్లీ బయల్దేరారు ఆ దంపతులు. కానీ గాలిలో ఉండగానే పసిపాప ఊపిరి అనంతవాయువుల్లో కలిసిపోయింది. స్పైస్ జెట్ ఆన్ బోర్డులో ఉండగానే చిన్నారి చనిపోయింది. దీంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఎయిమ్స్‌లో చికిత్స కోసం వస్తే చనిపోయిందని వాపోయారు. ఈ ఘటనపై స్పందించేందుకు చిన్నారి తల్లిదండ్రులు నిరాకరించారు. అయితే తమ విమానంలో చనిపోయిన చిన్నారి మృతిపై స్పందించేందుకు స్పైస్ జెట్ విమానయాన సంస్థ నిరాకరించింది.

English summary
A six-month-old infant, who was suffering from a heart ailment, died onboard a flight from Patna to Delhi early on Thursday, officials said. The child was being accompanied by her parents as they were flying down for medical treatment to the national capital. Deputy commissioner of police (Delhi airport) Sanjay Bhatia said they received information that the baby girl had died onboard SpiceJet flight 8481. “Our teams reached the airport and found that the child, a native of Begusarai in Bihar, was suffering from congenital heart disease. She had a small hole in her heart and she was undergoing treatment at AIIMS, New Delhi,” Bhatia said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X