బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెంగళూరులో నూతన సంవత్సర వేడుకలు, భర్త ముందే, విదేశీ యువతితో, అరెస్టు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: నూతన సంవత్సర వేడుకల సందర్బంగా బెంగళూరు నగరంలో మళ్లీ కీచికపర్వం కొనసాగడంతో యువతులు ఉలిక్కిపడ్డారు. నూతన సంవత్సర వేడుకల్లో మద్యం మత్తులో కొందరు యువకులు యువతులతో అసభ్యంగా ప్రవర్తించారు. పోలీసులు ఎంత నిఘా పెట్టినా కొందరు యువకులు మాత్రం మేము మారం ఇంతే అన్నట్లు వ్యవహరించారు.

గత సంవత్సరం !

గత సంవత్సరం !

గత ఏడాది నూతన సంవత్సర వేడుకల్లో జరిగినట్లే ఈ సారి కూడా కొందరు యువకులు మద్యం మత్తులో యువతులతో అసభ్యంగా ప్రవర్తించారు. నూతన సంవత్సరం సందర్భంగా గత ఏడాది బెంగళూరులో యువతులపై లైంగిక వేధింపులు జరగిన విషయం తెలిసిందే.

దేశవ్యాప్తంగా !

దేశవ్యాప్తంగా !

గత ఏడాది బెంగళూరు నగరంలోని ఎంజీరోడ్డు, బ్రిగేడ్ రోడ్డుతో పాటు బెంగళూరులో కొందరు యువతులు లైంగిక వేదింపులకు గురి కావడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అయిన విషయం తెలిసిందే. బెంగళూరులో నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొంటే లైంగిక వేధింపులు తప్పవు ? అనే విమర్శలు వచ్చాయి.

అర్దరాత్రి !

అర్దరాత్రి !

ఆదివారం అర్ధరాత్రి బెంగళూరు నగరం నడిబొడ్డున ఎంజీ రోడ్, బ్రిగేడ్‌ రోడ్డులో పెద్ద ఎత్తున యువతీ యువకులు గుమికూడి నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. నూతన సంవత్సర వేడుకలు పూర్తి అయిన తరువాత యువతులు ఇళ్లకు తిరిగివెలుతున్న సమయంలో మద్యం మత్తులో కొంతమంది యువకులు మహిళలు, యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు.

 విదేశీ యువతితో !

విదేశీ యువతితో !

విదేశీ యువతని పదేపదే తాకేందుకు ప్రయత్నించిన ఓ యువకుడిని పోలీసులు పట్టుకుని ఆ యువతికి క్షమాపణ చెప్పాలని సూచించారు. మొదట క్షమాపణలు చెప్పడానికి ఆ యువకుడు నిరాకరించాడు. విదేశీ యువతికి క్షమాపణలు చెప్పడానికి నిరాకరిస్తే క్రిమినల్‌ కేసు పెడతామని పోలీసులు హెచ్చరించడంతో అతను యువతి కాళ్ల మీద పడి క్షమాపణ చెప్పి క్రిమినల్ కేసు నుంచి తప్పించుకున్నాడు.

భర్త ఎదురుగానే

భర్త ఎదురుగానే

బ్రిగేడ్ రోడ్డులో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో యువతి యువకులతో పాటు దంపతులు పాల్గొన్నారు. భర్త ఎదురుగానే అతడి భార్యతో అసభ్యంగా ప్రవర్తించిన యువకులను బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

60 మంది అరెస్టు

60 మంది అరెస్టు

నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొని యువతులను వేధింపులకు గురి చేసిన వారిని, పిక్ ప్యాకెటర్లు, దొంగలతో పాటు 60 మందిని అరెస్టు చేశామని సీనియర్ పోలీసు అధికారి సీమంత్ కుమార్ సింగ్ చెప్పారు. ఎంజీ రోడ్డు, బ్రిగేడ్ రోడ్డులో 1, 500 మంది పోలీసులు నూతన సంవత్సర వేడుకలకు భద్రత కల్పించారని సీమంత్ కుమార్ సింగ్ వివరించారు.

హోం మంత్రి క్లారిటీ

హోం మంత్రి క్లారిటీ

2018 నూతన సంవత్సర వేడుకల్లో బెంగళూరు నగరంలో ఎలాంటి అసాంఘిక సంఘటనలు జరగలేదని కర్ణాటక హోం శాఖ మంత్రి రామలింగా రెడ్డి మీడియాకు చెప్పారు. గత సంవత్సరం జరిగిన సంఘటనలు గుర్తు పెట్టుకుని అలాంటి సంఘటనలు మరోసారి జరకుండా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని, కొందరు యువకులు మద్యం మత్తులో దురుసుగా ప్రవర్తించారని హోం శాఖ మంత్రి రామలింగా రెడ్డి వివరించారు.

English summary
Sixty people were arrested for allegedly creating ruckus during New Year celebrations in Bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X